Begin typing your search above and press return to search.

ఫోటో టాక్ : రెడ్‌ డ్రెస్ లో మన అందాల మిస్ వరల్డ్‌

హర్యానాకు చెందిన మానుషి చిల్లర్ 67వ మిస్‌ వరల్డ్ 2017 కిరీటం దక్కించుకున్న విషయం తెల్సిందే

By:  Tupaki Desk   |   15 Dec 2023 11:30 AM GMT
ఫోటో టాక్ : రెడ్‌ డ్రెస్ లో మన అందాల మిస్ వరల్డ్‌
X

హర్యానాకు చెందిన మానుషి చిల్లర్ 67వ మిస్‌ వరల్డ్ 2017 కిరీటం దక్కించుకున్న విషయం తెల్సిందే. మిస్ వరల్డ్‌ గా నిలిచిన మాసుషి చిల్లర్ వెంట బాలీవుడ్ ఫిల్మ్‌ మేకర్స్ పడ్డారు. కానీ ఆమె మాత్రం ప్రతి ఒక్క సినిమాకు ఓకే చెప్పకుండా పెద్ద సినిమాలకు మాత్రమే ఓకే చెబుతోంది.


సామ్రాట్‌ పృథ్వీరాజ్ సినిమా తో బాలీవుడ్‌ లో అడుగు పెట్టిన మానుషి చిల్లర్ కి కమర్షియల్‌ గా హిట్ దక్కలేదు. కానీ హీరోయిన్‌ గా మంచి గుర్తింపు దక్కింది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు అయిదు భారీ ప్రాజెక్ట్ లు ఉన్నట్లుగా బాలీవుడ్‌ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఇక సోషల్‌ మీడియా ద్వారా మానుషి చిల్లర్ రెగ్యులర్ గా తన అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా తన ఫాలోవర్స్ కు వినోదాన్ని పంచుతూ ఉంది. ఆరున్న మిలియన్ల ఫాలోవర్స్ ను కలిగి ఉన్న మానుషి తాజాగా తన రెడ్ డ్రెస్ లో అందంగా కనిపిస్తున్న ఫోటోలను షేర్ చేసింది.

మానుషి ఏ ఫోటో షేర్‌ చేసినా కూడా నిమిషాల్లో లక్షల్లో లైక్స్ ను దక్కించుకుంటూ ఉంటుంది. ఇక ఈ ఫోటో కి కూడా మంచి స్పందన దక్కుతోంది. ఇంత అందంగా ఉన్న మానుషి చిల్లర్ కి అదృష్టం కలిసి వచ్చి బాలీవుడ్‌ లో రెండు మూడు హిట్స్ పడితే కచ్చితంగా టాప్‌ హీరోయిన్ గా నిలవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.