Begin typing your search above and press return to search.

త్రిష, మన్సూర్ అలీ వివాదం.. మెగాస్టార్ కు లీగల్ నోటీసు?

ప్రముఖ తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ ఇటీవల త్రిషపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు ఎంత పెద్ద వివాదానికి దారితీశాయో తెలిసిందే

By:  Tupaki Desk   |   26 Nov 2023 11:18 AM GMT
త్రిష, మన్సూర్ అలీ వివాదం.. మెగాస్టార్ కు లీగల్ నోటీసు?
X

ప్రముఖ తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ ఇటీవల త్రిషపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు ఎంత పెద్ద వివాదానికి దారితీశాయో తెలిసిందే. త్రిషపై మన్సూర్ అలీ చేసిన వ్యాఖ్యలను ఇండస్ట్రీ ప్రముఖులు తప్పుబడుతూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రిష సైతం వెంటనే రియాక్ట్ అవుతూ ఆయనపై ఫైర్ అయింది. కోలీవుడ్ పెద్దలతో సహా టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, నితిన్ తదితరులు ఈ విషయంలో మన్సూర్ అలీ పై మండిపడ్డారు.

మరోవైపు నడిగర్ సంఘం కూడా మన్సూర్ అలీపై చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే అతనిపై తాత్కాలికంగా నిషేధం విధించింది. ఇక ఎట్టకేలకు శుక్రవారం క్షమాపణలు చెప్పిన ఆయన త్రిషపై తనకు ఎలాంటి దురుద్దేశం లేదని, తాను సరదాగానే ఆ వ్యాఖ్యలు చేశానని చెప్పాడు. ఈ మేరకు త్రిషకు క్షమాపణలు చెబుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో మన్సూర్ అలీ, 'నాతోటి నటి త్రిష దయచేసి నన్ను క్షమించండి' అని పేర్కొన్నాడు.

ఈ నేపథ్యంలో త్రిష తన సోషల్ మీడియా పేజీలో..' తప్పు చేయడం మానవుడి సహజం క్షమించడం అనేది దైవం చూసుకుంటుంది' అని పోస్ట్ పెట్టింది. దాంతో ఎట్టకేలకు ఈ వివాదానికి ఎండ్ కార్డు పడినట్లయింది. ఇదిలా ఉంటే త్రిషపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మన్సూర్ తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు. ఖుష్బూ, త్రిష, చిరంజీవి లపై పరువు నష్టం, పరిహారం, క్రిమినల్, సివిల్ దావా..

ముందస్తు అల్లర్లు, నగరంలో పది రోజులపాటు ప్రజాశాంతికి విగాథం కలిగించడం, ఇతరులను రెచ్చగొట్టడం వంటి అన్ని కేటగిరీల కింద కేసు నమోదు చేయబోతున్నట్లు మన్సూర్ అలీ ప్రకటించాడు. ఈ మేరకు తన లాయర్ గురు ధనుంజయ ద్వారా రేపు కోర్టులో కేసు వేయబోతున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా ముగ్గురికి నోటీసులు జారీ చేస్తానని తెలిపాడు.

నవంబర్ 11న సమావేశంలో తాను మాట్లాడిన నిజమైన వీడియోని వారికి చూపించానని ఈ సందర్భంగా మన్సూర్ అలీ వెల్లడించాడు. తాను మాట్లాడిన వారం తర్వాత అంటే నవంబర్ 19న ఈ వీడియోని తన ప్రసంగానికి ముందు, తర్వాత కొందరు ఎడిట్ చేసి త్రిషను అసభ్యకరంగా మాట్లాడినట్టు చిత్రీకరించారని అన్నారు. ఈ కేసులో తాను నిజమైన వీడియోని పంపానని మరికొన్ని ఆధారాలతో రేపు కేసు నమోదు చేయబోతున్నట్లు తెలిపారు.