Begin typing your search above and press return to search.

Mansion 24 వెబ్​ సిరీస్​.. భయాన్ని తట్టుకోగలరా

రీసెంట్​గా రావురమేశ్​కు సంబంధించిన కొత్త పోస్టర్​ను రిలీజ్​ చేసి సిరీస్​పై మరింత ఆసక్తిని క్రియేట్ చేశారు.

By:  Tupaki Desk   |   27 Sep 2023 5:40 AM GMT
Mansion 24 వెబ్​ సిరీస్​.. భయాన్ని తట్టుకోగలరా
X

రాజుగారి గ‌ది 3 త‌ర్వాత కొంత కాలం పాటు సినిమాల‌కు గ్యాప్ ఇచ్చిన యాంకర్ కమ్ డైరెక్టర్ ఓంకార్.. త్వరలోనే ఓ హార‌ర్ వెబ్‌ సిరీస్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. సినిమాకు సంబంధించి వరుసగా పలు పోస్టర్​ను డిఫరెంట్​గా డిజైన్​ చేసి వదులుతూ భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు మేకర్స్​.


మ్యాన్ష‌న్ 24 అనే టైటిల్​తో రాబోతున్న ఈ సిరీస్​లో నటి వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌ పోషిస్తోంది. ఇంకా ఈ సిరీస్‌లో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌తో పాటు బిగ్‌బాస్ విన్న‌ర్ బిందుమాధ‌వి, మాన‌స్‌, అవికాగోర్, విద్యుల్లేఖ‌రామ‌న్, అమ‌ర్‌దీప్ చౌద‌రి ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఇంకా వీరందరితో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల‌కు చెందిన ఇతర సీనియ‌ర్ న‌టులు కూడా సిరీస్​లో నటిస్తున్నారు. వీరిలో సత్యరాద్, రావు రమేశ్ కూడా ఉన్నారు.

ఇప్పటికే వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్, అవికాగోర్, సత్యరాజ్​ పోస్టర్లతో భయపెట్టిన మేకర్స్​.. రీసెంట్​గా రావురమేశ్​కు సంబంధించిన కొత్త పోస్టర్​ను రిలీజ్​ చేసి సిరీస్​పై మరింత ఆసక్తిని క్రియేట్ చేశారు. చీకటి ఉన్న ప్రదేశంలో లాంతరు వెలుగులో పాడుబడ్డ బిల్డింగ్ ముందు రావురమేశ్ ఒంటి కన్నుతో దేన్నో తీక్షణంగా షాకింగ్​గా చూస్తూ కనిపించారు. భయం ఎలా ఉంటుందో చూడండి. మీరు హ్యాండిల్ చేయగలరా అంటూ మేకర్స్​ క్యాప్షన్ రాసుకొచ్చారు

ఇలా ఈ వరుస పోస్టర్లను చూస్తుంటే సిరీస్ మంచి హారర్​ థ్రిల్లింగ్​గా ఉండబోతున్నట్లు. తెలుస్తోంది. చూడాలి మరి ఇది ఎలాంటి రెస్పాన్స్​ అందుకుంటుందో.. ఇకపోతే ఈ మ్యాన్ష‌న్ 24 వెబ్‌సిరీస్ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. ఓ పురాత‌న భ‌వంతిలో అడుగుపెట్టిన కొంద‌రు యువ‌తీ యువ‌కుల‌కు ఎదురైన ప‌రిణామాల‌తో ఈ వెబ్‌సిరీస్ సాగ‌నుందని తెలుస్తోంది.

కాగా, టీవీ రియాలిటీ షోస్​తో గుర్తింపు పొందిన ఓంకార్.. రాజుగారి గ‌ది సిరీస్​తో డైరెక్ట‌ర్‌గా మారారు. వీటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ ముందు బాగా ఆడాయి. అలానే సిక్త్స్ సెన్స్‌, డ్యాన్స్ ఐకాన్‌, కామెడీ స్టార్స్ ధ‌మాకా వంటి రియాలిటీ షోస్‌కు క్రియేట‌ర్‌గా, హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.