Begin typing your search above and press return to search.

మనోజ్‌ మాటలు.. మౌనిక కంట కన్నీళ్లు

మంచు మనోజ్‌ దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఒక వైపు సినిమా చేస్తూనే మరో వైపు ఈటీవీ విన్‌ ఓటీటీ కోసం ఒక గేమ్‌ షో ని చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   7 Dec 2023 12:30 PM GMT
మనోజ్‌ మాటలు.. మౌనిక కంట కన్నీళ్లు
X

మంచు మనోజ్‌ దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఒక వైపు సినిమా చేస్తూనే మరో వైపు ఈటీవీ విన్‌ ఓటీటీ కోసం ఒక గేమ్‌ షో ని చేస్తున్నాడు. ఉస్తాద్‌ అనే గేమ్‌ షో తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మంచు మనోజ్‌ తాజాగా ఆ షో ప్రమోషన్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చి పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు.

ముఖ్యంగా ఏడు ఏళ్ల గ్యాప్ గురించి మంచు మనోజ్ మాట్లాడుతూ... తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందుల కారణంగా ఏడేళ్లు మీకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అయితే మౌనిక తో ప్రేమలో పడి, ఆమెతో ఏడు అడుగులు వేసిన తర్వాత ఫ్యాన్స్ ప్రేమ మరియు వారి అభిమానం విలువ తెలిసిందని మంచు మనోజ్ పేర్కొన్నాడు.

మంచు మనోజ్ మాటల్లో మౌనిక పై ఉన్న ప్రేమ కనిపించింది. మంచు మనోజ్‌ తన గురించి మాట్లాడుతున్న సమయంలో మౌనిక కళ్లలో నీళ్లు తిరిగాయి. జీవితంలో మార్పు తీసుకు వచ్చే జీవిత భాగస్వామి లభించినందుకు సంతోషంగా ఉంటుంది. ప్రస్తుతం మంచు మనోజ్ అదే ఆనందంలో ఉన్నాడు.

ఉస్తాద్‌ గేమ్‌ షో ఇప్పటి వరకు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన గేమ్‌ షో లతో పోల్చితే చాలా విభిన్నంగా ఉంటుందని, ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉంటుందని మంచు మనోజ్ చెప్పుకొచ్చాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా సంస్థ ఈ గేమ్‌ షో ప్రొడక్షన్ బాధ్యతలు చూడటం ప్రత్యేక విషయంగా చెప్పుకోవాలి. వచ్చే వారం ఈ గేమ్‌ షో ఈటీవీ విన్ ఓటీటీ యాప్‌ లో స్ట్రీమింగ్‌ అవ్వబోతుంది.