Begin typing your search above and press return to search.

నేను అలా చేయడం ఎవరికి నచ్చలేదు..!

సినిమాల్లో చేస్తున్న సమయంలో ఎందుకు ఇలా సీరియల్స్ లో నటించాలని అనే వారు.

By:  Tupaki Desk   |   20 Feb 2024 10:23 AM GMT
నేను అలా చేయడం ఎవరికి నచ్చలేదు..!
X

బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ కెరీర్‌ ఆరంభంలో టీవీ సీరియల్స్ లో కూడా నటించిన విషయం తెల్సిందే. స్వాభిమాన్ సీరియల్ తో ప్రేక్షకులను మెప్పించిన విషయం తెల్సిందే. సీరియల్‌ తో నటుడిగా తనను తాను నిరూపించుకున్నాను అంటూ బాజ్‌పాయ్‌ చెప్పుకొచ్చాడు.

సత్య సినిమాలో నటించేందుకు స్వాభిమాన్ సినిమా నాకు ఒక యాక్టింగ్ స్కూల్ మాదిరిగా నిలిచిందని మనోజ్ చెప్పుకొచ్చారు. ఆ సీరియల్‌ నాకు శిక్షణ కేంద్రంగా నిలిచిందని మనోజ్ బాజ్‌పాయ్‌ పేర్కొన్నాడు. ఆ సీరియల్‌ చేసే సమయంలో కొందరు నన్ను విమర్శించారు.

నన్ను అభిమానించే వారు, నాతో సన్నిహితంగా ఉండేవారు చాలా మంది కూడా నేను ఆ సీరియల్‌ లో నటించడం ఇష్టపడలేదు. సినిమాల్లో చేస్తున్న సమయంలో ఎందుకు ఇలా సీరియల్స్ లో నటించాలని అనే వారు. నేను ఆ సీరియల్‌ లో నటించడం ద్వారానే ఇప్పుడు ఈ స్థాయి గుర్తింపు దక్కిందని అన్నాడు.

ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌ సిరీస్ తో హిందీ ప్రేక్షకులతో పాటు అన్ని భాషల ప్రేక్షకులను మెప్పించిన మనోజ్ బాజ్‌పాయ్‌ సౌత్‌ లో కూడా పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. సీరియల్స్ లో నటించడం వల్లే ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నాను. గతంలో మనం తీసుకున్న నిర్ణయాలు కెరీర్‌ ను ప్రభావితం చేస్తాయని మనోజ్ బాజ్‌పాయ్‌ విషయంలో నిరూపితం అయ్యింది.