Begin typing your search above and press return to search.

మ‌నోజ్-మౌనిక దంపతుల‌కు పండంటి ఆడ‌బిడ్డ‌!

మనోజ్ కుమార్ - మౌనిక ఎంతో ఎదురుచూస్తున్న తమ ఆడబిడ్డను స్వాగతించారని ప్రకటించడం మాకు చాలా ఆనందంగా ఉంది.

By:  Tupaki Desk   |   13 April 2024 7:51 AM GMT
మ‌నోజ్-మౌనిక దంపతుల‌కు పండంటి ఆడ‌బిడ్డ‌!
X

మంచు మనోజ్ కుమార్ -మౌనిక భూమా దంప‌తుల‌కు పండంటి ఆడ‌బిడ్డ జ‌న్మించింది. ఈ విష‌యాన్ని మ‌నోజ్ సోద‌రి లక్ష్మీ ప్ర‌స‌న్న సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. ఆ చిన్నారికి అప్పుడే ఎంఎం పులి అని స‌ర‌దాగా ఓ పేరు కూడా పెట్టేసారు. 'వారు మొత్తం ఇప్పుడు నలుగురు! దేవతలచే ఆశీర్వదించబడిన... ఒక చిన్న దేవత వచ్చింది! మనోజ్ కుమార్ - మౌనిక ఎంతో ఎదురుచూస్తున్న తమ ఆడబిడ్డను స్వాగతించారని ప్రకటించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ధైరవ్ చాలా సంతోషించాడు. ఆ పాపాయికి ప్రేమతో మేము 'ఎమ్ ఎమ్ పులి' అని పిలుచుకుంటున్నాం' అని రాసుకొచ్చారు.

మ‌నోజ్-మౌనిక‌లది ప్రేమ వివాహం. ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న స్నేహం ప్రేమ‌గా మార‌డంతో వివాహ బంధంతో దంప‌తులయ్యారు. ఈ పెళ్లి నిరాడంబ‌రంగా జ‌రిగింది. కేవ‌లం కుటుంబ స‌భ్యులు...సన్నిహితులు..స్నేహితుల స‌మ‌క్షంలో జ‌రిగింది. ఈ పెళ్లి బాధ్య‌త‌ల‌న్నీ మంచు ల‌క్ష్మి ద‌గ్గ‌రుండి చూసుకున్నారు. ఫిల్మ్ నగర్‏లోని ఆమె స్వగృహంలో వీరి వివాహం జరిగింది. ఇక మంచు మ‌నోజ్ మ‌ళ్లీ న‌టుడిగా బిజీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. దాదాపు ఐదేళ్ల పాటు వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో సినిమాల‌కు దూరంగా ఉన్నారు.

అదే స‌మ‌యంలో మౌనిక‌తోనూ ప్రేమ‌లో ప‌డ్డారు. ఇక ఆమెతో వివాహం అనంత‌రం మ‌ళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభిం చాడు. వృత్తిప‌రంగా న‌టుడిగా బిజీ అవుతున్నాడు. ప్ర‌స్తుతం వాట్ ద ఫిష్ అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. అన్ని ప‌నులు పూర్తిచేసి మ‌నోజ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా మే 20న రిలీజ్ చేస్తార‌నే ప్ర‌చారం సాగుతోంది. మ‌నోజ్ చివ‌రిగా 'ఒక్క‌డు మిగిలాడు' అనే సినిమాలో న‌టించాడు. ఆ త‌ర్వాత 'ఇది నా ల‌వ్ స్టోరీ'..'ఆప‌రేష‌న్ 2019' లాంటి చిత్రాల్లో కామియో అపిరియ‌న్స్ ఇచ్చాడు. ఈ రెండు చిత్రాలు 2018 లో రిలీజ్ అయ్యాయి.