Begin typing your search above and press return to search.

లేడీ సూప‌ర్ స్టార్ పోస్ట‌ర్ ఇంట్రెస్టింగ్..కాన్సెప్ట్ ఏంట‌బ్బా?

ఈ నేప‌థ్యంలో లాక్ అయిన 77వ సినిమా 'మన్నగట్టి' కూడా అలాంటిదేన‌ని తెలుస్తోంది. తొలిసారి దర్శకుడు డ్యూడ్ విక్కీతో క‌లిసి ప‌నిచేస్తోంది.

By:  Tupaki Desk   |   18 Sep 2023 1:46 PM GMT
లేడీ సూప‌ర్ స్టార్ పోస్ట‌ర్ ఇంట్రెస్టింగ్..కాన్సెప్ట్ ఏంట‌బ్బా?
X

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార జ‌ర్నీ జెట్ స్పీడ్ తో ప‌రుగులు పెట్టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే 'జ‌వాన్' తో బాలీవుడ్లో భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది. అమ్మ‌డి డెబ్యూ చిత్ర‌మే పాన్ ఇండియాలో సంచ‌ల‌న విజ‌యం సాధించింది.ఈ విజ‌యం న‌య‌న్ బాలీవుడ్ కెరీర్ కి పూల బాట వేసింది. అక్క‌డా లేడీ సూప‌ర్ స్టార్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ లా సత్తా చాట‌డం ఖాయ‌మ‌ని అభిమానులు భావిస్తున్నారు.


ఇక సౌత్ ప‌రంగా అందులోనూ కోలీవుడ్ లో అమ్మ‌డు పెళ్లైన దగ్గ‌ర నుంచి మ‌రింత సెల‌క్టివ్ గా వెళ్తోన్న సంగ‌తి తెలిసిందే. గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు దూరంగా ఉంటూ వీలైనంత వ‌ర‌కూ లేడీ ఓరియేంటెడ్ చిత్రాల‌తోనే స‌త్తా చాటాల‌ని చూస్తోంది. ఇప్ప‌టికే ఆ త‌ర‌హా ప్ర‌య‌త్నాలు కొన్ని చేసింది. కానీ అమ్మ‌డికి అనుకున్నంత గుర్తిం ఇంకా ద‌క్క‌లేదు. ఈ నేప‌థ్యంలో ఎక్కువ‌గా ఎంపిక చేసుకునే క‌థ‌లు మ‌హిళా ప్రాధాన్యత ఉన్న చిత్రాల వైపే మొగ్గు చూపుతుంది.

ఇప్ప‌టికే ల్యాండ్ మార్క్ 75వ చిత్రం 'లేడీ సూప‌ర్ స్టార్ 75' టైటిల్ తో వినిపిస్తుంది. అలాగే 76వ చిత్రం కూడా అలాంటింది. ఈ నేప‌థ్యంలో లాక్ అయిన 77వ సినిమా 'మన్నగట్టి' కూడా అలాంటిదేన‌ని తెలుస్తోంది. తొలిసారి దర్శకుడు డ్యూడ్ విక్కీతో క‌లిసి ప‌నిచేస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. పోస్ట‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది. క‌రెన్సీ నోట్లు.. మ‌ధ్య‌లో ఎర్ర‌టి తివాచీ పై తిను ప‌దార్ధాలు..చుట్టు ప‌క్క‌ల ప‌చ్చ‌ని గ‌డ్డి..రాళ్లు ర‌ప్ప‌లతో పోస్ట‌ర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్.. బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ ని ఆధారంగా తీసుకుని తెర‌కెక్కిస్తోన్న చిత్రంలా క‌నిపిస్తోంది.

1960 కాలంలో సాగే స్టోరీ ఇది. అప్ప‌టి వాతావ‌ర‌ణం..పాత్ర‌ల‌తో రియ‌లిస్టిక్ ఫీల్ తీసుకురాబోతున్నారు. ఇందులో యోగిబాబు, దేవదర్శిని, గౌరీ కిషన్, నరేంద్ర ప్రసాత్, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రోల్డాన్ సంగీతం అందిస్తుండ‌గా ఆర్. డి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ బాధ్య‌త‌లు తీసుకున్నారు. ఈ చిత్రాన్ని ప్రిన్స్‌ పిక్చర్స్‌ పతాకంపై లక్ష్మణ్‌ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుంది. ఇవి గాక అమ్మ‌డి చేతిలో ఇంకా రెండు..మూడు ప్రాజెక్ట్ లున్నాయి. ఇవ‌న్నీ రెండేళ్ల‌లో పూర్త‌వుతాయ‌ని స‌మాచారం.