Begin typing your search above and press return to search.

మన్మథుడు లవ్లీ జోడి.. మళ్ళీ ఇన్నాళ్ళకు

ఇక నాగార్జున కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలలో మన్మధుడు కూడా టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు

By:  Tupaki Desk   |   4 March 2024 11:03 AM GMT
మన్మథుడు లవ్లీ జోడి.. మళ్ళీ ఇన్నాళ్ళకు
X

ఆరు పదుల వయసు దాటినా కూడా ఇంకా యువ మన్మధుడి తరహాలోనే కనిపించే నాగార్జున తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా ప్రయోగాత్మకమైన సినిమాలు చేయడంలోనూ ఆయన స్టైలే వేరు అని చాలా సార్లు నిరూపించాడు. ఇక ఆయన నుంచి ఎలాంటి సినిమా వచ్చినా కూడా అందులో ఏదో ఒక డిఫరెంట్ కంటెంట్ ఉంటుంది అని చెప్పవచ్చు.

ఇక నాగార్జున కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలలో మన్మధుడు కూడా టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. విజయభాస్కర్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమాకు త్రివిక్రమ్ స్టోరీ డైలాగ్స్ అందించారు. ఇప్పటికీ సినిమాలోని కామెడీ సీన్స్ సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో వైరల్ అవుతూనే ఉంటాయి. అంతే కాకుండా నాగ్ అభి క్యారెక్టర్ లోని సీన్స్ ఎవరు మర్చిపోలేరు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే క్యూట్ లవ్ స్టోరీ కూడా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్.

ముఖ్యంగా మహీ క్యారెక్టర్ కూడా చాలా బాగా హైలెట్ అయింది. చూడగానే అందమైన చిరునవ్వుతో ఆకట్టుకున్న ఆ అమ్మాయి అసలు పేరు అషు. ప్రస్తుతం కూడా ఆమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత అషు హైదరాబాద్ లో కనిపించింది. ఒక పార్టీలో ఆమె నాగార్జునను కూడా కలుసుకోవడం విశేషం. అంతే కాకుండా అమలతో కూడా ప్రత్యేకంగా ఫోటోలు దిగారు.

వీరికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇద్దరు కూడా బ్లాక్ కలర్ డ్రెస్సులో చాలా అందంగా దర్శనమిచ్చారు. ఇప్పటికి మన్మధుడు జంట ఎంతో అందంగా ఉంది అంటూ సినిమా వచ్చి ఏళ్ళు దాటినా ఇంకా వారి వయసు మాత్రం తగ్గలేదని మరి కొందరు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇక అన్షు విషయానికి వస్తే ఆమె ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు కొనసాగలేదు.

పెళ్లి చేసుకొని ఆ తర్వాత లండన్ వెళ్లిపోయింది. అక్కడే చాలా కాలం పాటు ఉన్న ఆమె ఈ మధ్యనే హైదరాబాద్ వచ్చి తన స్నేహితులను కలుసుకుంది. అలానే నాగర్జునను కూడా కలుసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరోవైపు నాగార్జున వరుస సినిమాలతో చాలా బిజీగా కనిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల ధనుష్ సినిమాలో ఆయన ఒక స్పెషల్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే తన 100వ సినిమాను కూడా నాగార్జున త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు.