Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్..200 కోట్ల వెనుక ఎన్నో కారణాలు!

కొన్ని నెలలుగా మలయాళ సినీ ఇండస్ట్రీ వరుస బ్లాక్ బస్టర్లతో సందడి చేస్తోంది. ఆయా సినిమాల డబ్బింగ్ వెర్షన్లు ఇతర భాషల్లో కూడా సత్తా చాటుతున్నాయి

By:  Tupaki Desk   |   7 April 2024 11:30 AM GMT
బాక్సాఫీస్..200 కోట్ల వెనుక ఎన్నో కారణాలు!
X

కొన్ని నెలలుగా మలయాళ సినీ ఇండస్ట్రీ వరుస బ్లాక్ బస్టర్లతో సందడి చేస్తోంది. ఆయా సినిమాల డబ్బింగ్ వెర్షన్లు ఇతర భాషల్లో కూడా సత్తా చాటుతున్నాయి. వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇటీవల టాలీవుడ్ లో రిలీజైన సర్వైకల్ థ్రిల్లర్ మంజుమ్మల్ బాయ్స్ తెలుగు వెర్షన్ మంచి వసూళ్లతో అదరగొడుతోంది. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. తెలుగులో డబ్బింగ్ మూవీస్ పరంగా ఆల్ టైం రికార్డు ఓపెనింగ్స్ అందుకుంది!

ఇటీవల రిలీజైన ప్రేమలు మూవీ డబ్బింగ్ వెర్షన్ రికార్డును మంజుమ్మల్ బాయ్స్ ఈజీగా బ్రేక్ చేసేసింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, ప్రైమ్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిన్న(ఏప్రిల్ 6వ తేదీ) రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. డైరెక్టర్ చిదంబరం తెరకెక్కించిన ఈ ఎమోషనల్ థ్రిల్లర్‌.. తక్కువ బడ్జెట్‌తో రూపొంది, ఇప్పటి వరకు రూ. 230 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

టాలీవుడ్ సినీ ప్రియులంతా ఇప్పుడు ఈ సినిమా కోసమే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా రూ.200 కోట్లు ఎలా వసూలు చేసిందని చర్చించుకుంటున్నారు. భారీ లోతు ఉన్న గుహలోకి ప్రమాదవశాత్తూ జారిపడిన స్నేహితుడిని మిగతా మిత్రులు రక్షించే సాధారణ కథకు రూ.200 కోట్లు ఎలా వచ్చాయ్? అని అడుగుతున్నారు. కొందరు ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడాన్ని చూసి ఆశ్చర్య పోతున్నట్లు చెబుతున్నారు.

అయితే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడానికి గల పలు కారణాలను విశ్లేషిస్తున్నారు కొందరు సినీ ప్రియులు. ఈ మూవీలోని చాలా భాగం తమిళనాడు కొడైకెనాల్ లో జరుగుతుంది. అందుకే అక్కడ పోలీసుల డైలాగ్స్ అన్నీ తమిళంలోనే ఉంటాయి. సినిమాలో మిత్రులందరికీ ఒక స్నేహితుడు వాటిని అనువదించి చెబుతాడు. తన ట్రాన్స్ లేషన్ లో భావోద్వేగాన్ని కూడా పండిస్తాడు. ఆ దృశ్యాల ద్వారా మనకు మాతృభాష రాని చోట సహాయం పొందడం ఎంతో కష్టమో అర్థమవుతుంది.

కొన్ని సీన్లు చాలా ఎమోషనల్ గా ఉంటాయి. దానికి తోడు ఇది నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కడంతో చాలా మంది అట్రాక్ట్ అవుతున్నారు. ఇక ఒరిజినల్ ఘటనకు చెందిన మంజుమ్మెల్ బాయ్స్ తమిళనాడు వారైనా.. కొచ్చిలో కూడా వారు ఫేమస్సే. దీంతో స్థానికులంతా సినిమాపై మంచి ఆసక్తి కనబరిచారు. ఏదేమైనా పాజిటివ్ మౌత్ టాక్ తో ఈ చిత్రం ఇంత పెద్ద హిట్ అయిందని చెప్పవచ్చు. స్టార్ నటీనటులు లేకపోయినా తగ్గేదేలే అంటూ దూసుకుపోతోంది. మరి తెలుగులో ఈ మూవీ ఎలాంటి లాభాలు అందిస్తుందో చూడాలి.