Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్స్ రికార్డ్స్‌ బ్రేక్ చేస్తోన్న న్యూ బాయ్స్‌

ఇప్పటి వరకు ఏ మలయాళ సినిమా కూడా రెండు వారాల్లో వంద కోట్ల వసూళ్లు నమోదు చేసిందే లేదు. అలాంటిది మంజుమ్మేల్‌ బాయ్స్‌ ఆ రికార్డ్‌ ను దక్కించుకుంది.

By:  Tupaki Desk   |   10 March 2024 6:46 AM GMT
సూపర్ స్టార్స్ రికార్డ్స్‌ బ్రేక్ చేస్తోన్న న్యూ బాయ్స్‌
X

మలయాళ సినిమా ఇండస్ట్రీలో మొదటి నుంచి కూడా మంచి కంటెంట్‌ ఓరియంటెడ్‌ సినిమాలు వస్తూ ఉండేవి. అప్పట్లో సినిమాలకు అవార్డులు, విమర్శకుల ప్రశంసలు దక్కేవి కానీ కమర్షియల్‌ గా తెలుగు మరియు తమిళ సినిమాల స్థాయిలో వసూళ్లు నమోదు అయ్యేవి కాదు. కానీ ఇప్పుడు వసూళ్ల విషయంలోనూ మలయాళ సినిమాలు కుమ్మేస్తున్నాయి.

కంటెంట్‌ ఓరియంటెడ్ సినిమాలకు కాస్త కమర్షియల్‌ టచ్ ఇస్తూ మలయాళ ఫిల్మ్‌ మేకర్స్ తీసుకు వస్తున్న సినిమాలకు భారీ ఎత్తున వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఒకప్పుడు పాతిక కోట్ల వసూళ్లు అంటే గొప్ప విషయం అన్నట్లు ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.

2024 సంవత్సరం ప్రారంభం అయ్యి మూడు నెలలు కూడా పూర్తి అవ్వకుండా మూడు భారీ బ్లాక్ బస్టర్‌ కమర్షియల్‌ హిట్‌ సినిమాలు వచ్చాయి. ప్రేమలు, బ్రహ్మయుగం సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో మంచి వసూళ్లు నమోదు చేశాయి.. ఇంకా చేస్తూనే ఉన్నాయి.

రెండు వారాల క్రితం వచ్చిన మంజుమ్మేల్‌ బాయ్స్ సినిమా కూడా ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు నమోదు చేస్తుంది. ఇప్పటి వరకు ఏ మలయాళ సినిమా కూడా రెండు వారాల్లో వంద కోట్ల వసూళ్లు నమోదు చేసిందే లేదు. అలాంటిది మంజుమ్మేల్‌ బాయ్స్‌ ఆ రికార్డ్‌ ను దక్కించుకుంది.

ఇప్పటికే వంద కోట్ల వసూళ్లు క్రాస్ చేసిన ఈ సినిమా ముందు ముందు మరింత వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. స్టార్స్ కి సూపర్‌ స్టార్స్ కి దక్కని ఈ అరుదైన వంద కోట్ల రికార్డ్‌ ఈ కొత్త బాయ్స్ సినిమాకు దక్కడం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

తెలుగు లో మంజుమ్మేల్ బాయ్స్ ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగు నేటివిటీకి కాస్త దగ్గరగా ఉంటుంది కనుక కచ్చితంగా మంచి వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.