Begin typing your search above and press return to search.

పిక్‌టాక్ : ఇన్నాళ్లైనా అదే అందం!

అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సిద్దు ఫ్రమ్‌ సికాకుళం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ మంజరి ఫడ్నిస్. టాలీవుడ్‌లో మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు దక్కించుకోవడంతో వరుస ఆఫర్లు సొంతం చేసుకుంది.

By:  Tupaki Desk   |   21 Jun 2025 4:00 PM IST
పిక్‌టాక్ : ఇన్నాళ్లైనా అదే అందం!
X

అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సిద్దు ఫ్రమ్‌ సికాకుళం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ మంజరి ఫడ్నిస్. టాలీవుడ్‌లో మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు దక్కించుకోవడంతో వరుస ఆఫర్లు సొంతం చేసుకుంది. 2008లో ఎంట్రీ ఇచ్చి ఇంకోసారి, శుభప్రదం, శక్తి వంటి సినిమాల్లో నటించింది. మొదటి సినిమాతో వచ్చిన ఫేమ్‌ తో ఆఫర్లు వచ్చాయి. కానీ ఆ తర్వాత వచ్చిన ఆఫర్లు సక్సెస్‌ కాకపోవడంతో టాలీవుడ్‌కి ఈ అమ్మడు దూరం కావాల్సి వచ్చింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ఇతర భాషల ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేసింది. మంజరి చేసిన ప్రనయత్నాలు సఫలం అయ్యాయి. మలయాళం, హిందీ, మరాఠీ ఇలా పలు భాషల్లో సినిమా ఆఫర్లు వచ్చాయి.


గత ఏడాది లోనూ ఈమె నటించిన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ ఏడాదిలో ఈమె నటించిన పుణే హైవే సినిమా విడుదలైంది. సినిమా ఆఫర్లు అయితే వస్తున్నాయి కానీ పెద్దగా హిట్స్ పడటం లేదు. కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా ఈమె బుల్లితెర తో పాటు ఓటీటీలోనూ సందడి చేస్తూ ఉంది. షార్ట్స్ ఫిల్మ్స్, వెబ్‌ సిరీస్‌, టీవీ షోలు, మ్యూజిక్ ఆల్బమ్స్ ఇలా అన్ని చోట్ల మంజరి కనిపిస్తూ వస్తుంది. సోషల్‌ మీడియాలో ఈమెకి మంచి ఫాలోయింగ్‌ ఉంది. సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో ఉన్న ఈ అమ్మడిని ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపుగా 5 లక్షల మంది ఫాలో అవుతూ ఉన్నారు. రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తుంది.

ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అంటూ అప్పట్లోనే మంచి పేరు సొంతం చేసుకుంది. ఇప్పుడు అది నిజం అని నిరూపించే విధంగా మరింత అందంగా సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇన్నాళ్లైనా ఇంకా అందం ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ఈమె షేర్‌ చేసిన ఈ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోలు కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్నాయి. ఈ రేంజ్‌ అందాల ఆరబోత కేవలం ఈ అమ్మడికే సాధ్యం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట ఈమె ఎప్పుడు ఫోటోలు షేర్‌ చేసినా వావ్‌ అంటూ కామెంట్‌ చేసే వారు ఎంతో మంది ఉంటారు. వారు మరోసారి ఈ అమ్మడి బ్లాక్‌ అండ్‌ వైట్‌ క్లీ వేజ్ షో కవ్వింపు ఫోటో షూట్‌కి పాజిటివ్‌ కామెంట్స్ చేస్తున్నారు.

వి ఇండియా ఛానల్‌లో సింగింగ్ రియాలిటీ షో లో పాప్‌ స్టార్స్‌ యొక్క ఇండియన్ వెర్షన్‌ రెండో సీజన్‌లో మంజరి కనిపించింది. మ్యూజికల్‌ బ్యాండ్‌ ఆస్మా కోసం ఫైనల్‌ వరకు చేరుకుంది. 2004లో రోక్ సాకో తో రోక్‌ అనే సినిమాలో నటించడం ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించింది. జానే తు యా జానే నా విజయం సాధించడంతో బాలీవుడ్‌లో మంజరికి మంచి గుర్తింపు లభించింది. పలు అవార్డులను సొంతం చేసుకున్న ఈ అమ్మడు ఒక పాట కూడా పాడింది. పలు కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించిన కారణంగా బుల్లి తెరపై అప్పట్లో రెగ్యులర్‌గా కనిపిస్తూ ఉండేది. ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో ఇలా అందాల ఆరబోత చేస్తూ వస్తుంది. టాలీవుడ్‌లో ఈ అమ్మడు రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.