Begin typing your search above and press return to search.

తమన్ అబద్ధాల గురించి మణిశర్మ అలా చెప్పాడేంటి..!

మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అంటే తెలుగు ప్రేక్షకులకు సూపర్ హిట్ సాంగ్స్ అన్ని గుర్తుకొస్తాయి.

By:  Tupaki Desk   |   8 Feb 2024 7:15 AM GMT
తమన్ అబద్ధాల గురించి మణిశర్మ అలా చెప్పాడేంటి..!
X

మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అంటే తెలుగు ప్రేక్షకులకు సూపర్ హిట్ సాంగ్స్ అన్ని గుర్తుకొస్తాయి. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకు మణిశర్మ తప్ప మరో మ్యూజిక్ డైరెక్టర్ పనిచేసే వారు కాదన్నట్టుగా ఆయన సంగీతం అందించారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఆ స్టార్స్ తోనే కాదు నేటితరం స్టార్స్ తో కూడా పనిచేశారు మణిశర్మ. ఆయన మ్యూజిక్ చేస్తున్నాడు అంటే సినిమా సగం హిట్ అని ఫిక్స్ అవుతారు. సినిమాలో సాంగ్స్ మాత్రమే కాదు మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. కథకు తగినట్టుగా బిజిఎం ఇవ్వడంలో ఆయనకు ఆయనే సాటి అనిపించేలా చేసుకున్నారు మణిశర్మ.

అయితే ఈమధ్య మణిశర్మకు అవకాశాలు తక్కువ అయ్యాయి. యువ సంగీత దర్శకులు దూసుకెళ్తున్న ఈ టైం లో మణిశర్మకు పెద్దగా ఛాన్స్ లు రావట్లేదు. వచ్చిన అర కొర అవకాశాలతో మణి తన మార్క్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం మణిశర్మ డబుల్ ఇస్మార్ట్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా మణిశర్మ ఒక ప్రోగ్రాం లో పాల్గొన్నారు. అందులో భాగంగా అనంత్ శ్రీరామ్ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.

తన కెరీర్ గురించి ఆడియన్స్ తో పంచుకున్న మణిశర్మ నేను మొదట వయొలిన్ నేర్చుకున్నా.. తర్వాత పెద్దగా ఉందని కీ బోర్డ్ కూడా నేర్చుకున్నానని అన్నారు. అయితే మీకు పాట నచ్చకపొతే స్పీకర్ బాక్సులు పగలగొడతారట అవునా అని అనంత్ శ్రీరామ్ అడిగితే.. ఆ తమన్ గాడు అన్నీ అబద్ధాలు చెప్పాడు. జీవితంలో ఒక్కసారే అలా చేశానులే అని నవ్వారు మణిశర్మ. ఇక కెరీర్ లో ఎంతోమంది సెలబ్రిటీస్ తో పనిచేయడం తన అదృష్టమంటూ చెప్పుకొచ్చారు మణిశర్మ.

మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఛలో సినిమా నుంచి లాస్ట్ ఇయర్ చిరు నటించిన భోళా శంకర్ సినిమాకు అతనే మ్యూజిక్ అందించాడు. మణిశర్మ కూడా తన దూకుడు పెంచాలని చూస్తున్నారు. ఐతే ఒకటి రెండు ఛాన్స్ లు తప్ప ఆయనకు పెద్దగా సినిమాలు పడట్లేదు. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారంటే అందులో మెలోడీ కచ్చితంగా ఉంటుంది. మళ్లీ మణి శర్మ తిరిగి ఫాం లోకి రావాలని ఆయన ఫ్యాన్స్ కోరుతున్నారు. స్టార్ హీరోలు కూడా మణిశర్మకు మరో ఛాన్స్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారు.