Begin typing your search above and press return to search.

శృంగార సన్నివేశం కోసం పలు రిహార్సల్

సౌత్‌ భాషల్లో కూడా సిరీస్‌ ఉండటంతో ఇండియ మొత్తం తెగ ట్రెండ్‌ అవుతోంది.

By:  Tupaki Desk   |   8 May 2024 12:30 PM GMT
శృంగార సన్నివేశం కోసం పలు రిహార్సల్
X

హిందీ ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో, ఓటీటీ ప్రేక్షకుల్లో ప్రస్తుతం 'హీరామండి' వెబ్‌ సిరీస్ గురించిన చర్చ జరుగుతోంది. కొన్ని వివాదాస్పద సన్నివేశాలు ఉన్నాయి అంటూనే చాలా మంది ఆ వెబ్‌ సిరీస్‌ ను తెగ చూస్తున్నారు. సౌత్‌ భాషల్లో కూడా సిరీస్‌ ఉండటంతో ఇండియ మొత్తం తెగ ట్రెండ్‌ అవుతోంది.

సోషల్‌ మీడియాలో హీరామండి కి సంబంధించిన చర్చలతో తెగ వైరల్‌ అవుతున్నాయి. స్క్రీన్‌ షాట్స్ మరియు డైలాగ్స్ అన్నా కూడా తెగ చర్చనీయాంశం అవుతున్నాయి. మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావు హైదరి తో పాటు ఇంకా పలువురు అందగత్తెలతో సంజయ్ లీలా భన్సాలీ ఈ వెబ్‌ సిరీస్ ను రూపొందించాడు.

నెట్‌ ఫ్లిక్స్ లో ఇటీవలే స్ట్రీమింగ్‌ అయిన ఈ వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్ లో భాగంగా హీరోయిన్స్ మీడియా ముందుకు వచ్చి పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు. తాజాగా సీనియర్‌ హీరోయిన్‌ మనీషా కోయిరాలా ఒక ఇంటర్వ్యూలో మేకింగ్ గురించి ఆసక్తికర వ్యాక్యలు చేసింది.

హీరామండి ఆఫర్‌ తాను నేపాల్‌ లో ఉన్నప్పుడు వచ్చిందని మనీషా చెప్పుకొచ్చింది. సంజయ్ కాల్‌ చేసి ఒక మంచి స్క్రిప్ట్‌ ఉంది. నీకు పంపుతున్నాను. నచ్చితే ఓకే చెప్పండి. మంచి పాత్ర మీరు చేస్తే బాగుంటుందని అన్నారు. స్క్రిప్ట్‌ చదివిన తర్వాత నా పాత్ర గురించి తెలుసుకున్న తర్వాత నో చెప్పలేక పోయాను.

వెబ్‌ సిరీస్‌ లో శేఖర్‌ సుమన్‌ తో శృంగార సన్నివేశాల గురించి సంజయ్ నాకు ముందే చెప్పారు. సంజయ్ ఏ సన్నివేశం అయినా ముందస్తుగా రిహార్సల్‌ చేయాల్సిందే. శృంగార సన్నివేశంను కూడా ముందుగానే రిహార్సల్‌ చేశాం. ఒకటికి రెండు సార్లు రిహార్సల్‌ అయిన తర్వాతే టేక్ కు వెళ్తామని చెప్పుకొచ్చింది.

నటిగా తాను గతంలో ఎన్నో పాత్రల్లో నటించాను. అయితే ఇలాంటి పాత్రను పోషించలేదు. ఇలాంటి ఒక పాత్ర ఈ సమయంలో రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను అంటూ మనీషా కోయిరాలా చెప్పుకొచ్చింది. నటిగా ముందు ముందు మరిన్ని సినిమాలు, వెబ్‌ సిరీస్ లు చేయాలని భావిస్తున్నట్లు మనీషా చెప్పారు.