వాటి జోలికెళ్లను..ఇకపై సింగిల్ గానే!
సీనియర్ నటి మనీషా కోయిరాలా జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు.
By: Srikanth Kontham | 23 Aug 2025 12:00 AM ISTసీనియర్ నటి మనీషా కోయిరాలా జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. బాలీవుడ్ సినిమాల్లో తనదైన ముద్ర వేసిన నటి. `ఒకే ఒక్కడు`, `క్రిమినల్` లాంటి చిత్రాలతో తెలుగు లోనూ అంతే ఫేమస్ అయ్యారు. ఇలా సంచలనమైన మనీషా జీవితం ఒక్క సారిగా కుదుపులకు లోనైంది. మహమ్మారి క్యాన్సర్ బారిన పడటం తిరిగి కోలుకోవడం తెలిసిందే. వ్యక్తిగత జీవితంలోనూ మనీషా ఎన్నో సవాళ్లను ఎదుర్కున్నారు. నటిగా ఫాంలో ఉన్న సమయంలో రిలేషన్స్ షిప్స్ విషయం లోనూ మనీషా పేరు అంతే హైలైట్ అయింది.
నానా పటేకర్ తో కలిసి `అగ్ని సాక్షి` సినిమా చేస్తోన్న సమయంలో అతడితో ప్రేమలో పడిందన్నది ఓ సంచలనం. దీంతో పెళ్లైన నానా పటేకర్ తో ప్రేమాయణం ఏంటని తీవ్ర విమర్శలు ఎదుర్కున్నారు. అటుపై `సౌదాగర్` సినిమాలో నటించిన వివేక్ ముష్రాన్ తోనూ సంబంధం ఉందని ప్రచారం జరిగింది. వాళ్లిద్దరి అనంతరం `మార్కెట్` సినిమా సమయంలో ఆర్యన్ వేద్ తోనూ రిలేషన్ షిప్ లో ఉందని అప్పటి బాలీ వుడ్ మీడియా కోడై కూసింది. హుస్సేన్ బాబాయ్ గా పేరొందిన డీజే హుస్సేన్, నేపాల్ లోని ఆస్ట్రేలియా అంబా సిడర్ క్రిస్పిన్ కొనరాయ్, లండన్ వ్యాపారి సిసిల్ అంథోనీ, అమెరికన్ స్పోర్స్ట్ కౌన్సిలర్ క్రిప్ట్రోపర్ డోరిస్ లాంటి పేర్లు నేపాలీ బ్యూటీ ప్రయాణంలో తెరపైకి వచ్చిన పేర్లు.
ఇవన్నీ ముగిసిన అనంతరం 2010 లో సామ్రాట్ దహాయ్ తో వివాహం అంతే సంచలనం. ఆ బంధం కూడా ఎంతో కాలం నిలువ లేదు. పెళ్లైన రెండేళ్లకే విడిపోయారు. అటుపై క్యాన్సర్ బారిన పడటం తిరిగి కోలుకో వడం తెలిసిందే. ఈ మొత్తం ప్రయాణంలో సరైన జీవితం కానిది ఏది? అంటే రిలేషన్ షిప్స్ లో ఉన్నది గానే మనీషా కోయి రాలా పేర్కొంది. రిలేషన్ షిప్స్ కారణంగా చాలా సమయం వృద్దా చేసుకు న్నానని తెలిపింది. వ్యక్తిగత...వృత్తిగత జీవితాలపై ఆ ప్రభావం పడిందన్నారు.
ప్రస్తుతం సింగిల్ గా ఉన్నా నని..ఇదే ఎంతో సంతోషంగా ఉందన్నారు. అప్పుడప్పుడు ఒంటరి అన్న భావన కలిగినా? ఆ ఆలోచన నుంచి బయటకు వస్తే ఇదే ఉత్తమమైన జీవితంగా పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరి జీవితంలో ఓ బ్యాడ్ ఫేజ్ ఉంటుందని...తన జీవితంలో రిలేషన్ షిప్స్ సహా అనారోగ్య కారణాలుగా తల్లికిం దులైందని తెలిపారు.
