Begin typing your search above and press return to search.

50లో 30 హొయ‌లు.. మ‌నీషా కొయిరాలా ది గ్రేట్

ఇటీవ‌ల మ‌నీషా కొయిరాలా కొంత వ‌య‌సు సంబంధ స‌మ‌స్య‌ల్ని ఎదుర్కొంటున్న‌ట్టు క‌నిపించింది. కానీ ఇంత‌లోనే ఒక కొత్త మేకోవ‌ర్‌తో అంద‌రినీ స‌ర్ ప్రైజ్ చేసింది.

By:  Tupaki Desk   |   18 Jun 2025 3:00 AM IST
50లో 30 హొయ‌లు.. మ‌నీషా కొయిరాలా ది గ్రేట్
X

త‌న‌దైన అందం, అద్భుత‌ న‌ట ప్ర‌తిభ‌తో దేశ‌వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకుంది నేపాలీ బ్యూటీ మ‌నీషా కొయిరాలా. బొంబాయి, ఒకే ఒక్క‌డు, క్రిమిన‌ల్ స‌హా ప‌లు ద‌క్షిణాది చిత్రాల్లో మ‌నీషా కొయిలారా న‌ట‌న‌కు ఫిదా కాని వాళ్లు లేరు. బాలీవుడ్ లోను అగ్ర క‌థానాయిక‌గా కొన‌సాగింది. అయితే ఈ బ్యూటీ న‌డివ‌య‌సులో క్యాన్స‌ర్ తో తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంది. అదృష్ట‌వశాత్తూ క్యాన్స‌ర్ ని జ‌యించి, అటుపై తిరిగి న‌టిగా కెరీర్ ని కొన‌సాగిస్తోంది.

ఇటీవ‌ల మ‌నీషా కొయిరాలా కొంత వ‌య‌సు సంబంధ స‌మ‌స్య‌ల్ని ఎదుర్కొంటున్న‌ట్టు క‌నిపించింది. కానీ ఇంత‌లోనే ఒక కొత్త మేకోవ‌ర్‌తో అంద‌రినీ స‌ర్ ప్రైజ్ చేసింది. మనీషా కొయిరాలా (54) నేపాలీ సెలూన్‌లో హెయిర్ మేకోవర్‌తో చాలా అందంగా కనిపిస్తున్న ఫోటోలు ఇప్పుడు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారాయి. మ‌నీషా ఇటీవ‌ల ఇన్ స్టాలో వ‌రుస‌గా వర్కవుట్ ఫోటోలు, స్నేహితులతో మీటింగుల‌కు సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేస్తోంది. అవి అభిమానుల్లో వైర‌ల్ గా మారుతున్నాయి. ఇప్పుడు మనీషా హెయిర్ మేకోవర్ తో స‌డెన్ స‌ర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ లుక్‌తో అభిమానులు ముగ్ధులయ్యారు.

ఈ లుక్ ఎలా సాధ్య‌ప‌డింది? అంటే..నేపాల్‌కు చెందిన `ఆర్డెన్- ది బ్యూటీ పాయింట్`లో ఈ కొత్త లుక్ ని డిజైన్ చేసారు. మ‌నీషా హెయిర్ కట్, మేకప్ ని డిజైన్ చేసింది ఈ సెలూన్ టెక్నీషియ‌న్ రాజేష్‌. అత‌డు మ‌నీషా హెయిర్ డోని కూడా మార్చేసాడు. ఇప్పుడు ఈ కొత్త లుక్ లో మ‌నీషా అల్ట్రా స్టైలిష్ గా క‌నిపిస్తోంది. వైర‌ల్ అవుతున్న క్లిప్ లో మనీషా తెల్లటి టాప్, లేత గోధుమరంగు ప్యాంటులో అందంగా కనిపించింది. త‌న‌కు ఇలాంటి కొత్త మేకోవ‌ర్ ని ఇచ్చిన రాజేష్ పై మ‌నీషా ప్ర‌శంస‌లు కురిపించింది.

మనీషా కొత్త లుక్ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఒక వ్యక్తి ``మీరు చాలా యవ్వనంగా, అందంగా కనిపిస్తున్నారు`` అని రాశారు. ఈ హెయిర్ స్టైల్‌లో మీరు అద్భుతంగా ఉన్నారు అని ఒక అభిమాని వ్యాఖ్యానించ‌గా, మీరు చాలా అరుదైన అందం అని మ‌రొక‌రు ప్ర‌శంసించారు. ఒక ఇన్‌స్టా యూజర్ ``90ల నాటి సూక్ష్మ సౌందర్యం`` అని ప్ర‌శంసించాడు. ``ఆమె మళ్ళీ 30 ఏళ్లకు ఎలా మారింది?`` అని మరొక వ్యక్తి వ్యాఖ్యానించాడు.

ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో వ‌య‌స్సు గురించి ప్ర‌స్థావించిన మ‌నీషా కొయిరాలా.. గ్లామ‌ర్ ఇండస్ట్రీలో ఉన్నా లేదా మరేదైనా, రంగంలో ఉన్నా కానీ, వృద్ధాప్యం మహిళలకు సంబంధించిన సమస్య. మనం సిగ్గుపడతాము. మ‌గాళ్లు ముస‌లాళ్లు అయిపోతే ట్రోలింగ్ చేయ‌డం నేను ఎప్పుడూ వినలేదు. కానీ చాలా మంది స్త్రీలను ట్రోల్ చేస్తారు. ఇది వయస్సును తక్కువగా చూడటం.. వయోవాదం పురుషుల కంటే మహిళలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది... అని అన్నారు.

మనీషా చివరిగా సంజయ్ లీలా భన్సాలీ వెబ్ సిరీస్ `హీరామండి: ది డైమండ్ బజార్‌`లో కనిపించింది. ఈ పీరియడ్ డ్రామా సిరీస్ భారత స్వాతంత్య్ర‌ ఉద్యమ సమయంలో లాహోర్‌లోని రెడ్-లైట్ జిల్లా హీరా మండి నేప‌థ్య క‌థ‌తో తెర‌కెక్కింది. సోనాక్షి సిన్హా, అదితి రావు హైదరి, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్ ల‌తో పాటు మ‌నీషా కొయిరాలా కీల‌క పాత్ర‌లో న‌టించింది. ఈ సిరీస్ మే 2024లో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ అయింది. జూన్ 2024 నుంచి రెండో సీజ‌న్ చిత్రీక‌ర‌ణ సాగ‌నుంది.