Begin typing your search above and press return to search.

మణి సర్ మిమ్మల్ని ఎన్నిసార్లు అడుక్కున్నాను!

చివ‌రికి షారుక్ ఖాన్ కూడా త‌న ఇమేజ్ మొత్తాన్ని ప‌క్క‌న‌బెట్టి అడుక్కున్నా! స‌రే మ‌ణిర‌త్నం మాత్రం నో అని డైరెక్ట్ గా చెప్ప‌లేక అలా ఎస్కేప్ అవుతున్నార‌ని ఆయ‌న మాట‌ల్ని బ‌ట్టి తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   11 Jan 2024 7:00 AM GMT
మణి సర్ మిమ్మల్ని ఎన్నిసార్లు అడుక్కున్నాను!
X

షారుక్ ఖాన్ -మ‌ణిర‌త్నం కాంబినేష‌న్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ క‌ల‌యిక‌లో తెర‌కెక్కిన ఒకే ఒక్క చిత్రంతో పాన్ షారుక్ ఖాన్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అదే 'దిల్ సే'. ఇద్ద‌రి కాంబినేష‌న్ లో తెర‌కె క్కిన 'దిల్ సే' అప్ప‌ట్లో ట్రెండ్ సెట్ట‌ర్ మూవీ అన్న సంగ‌తి తెలిసిందే. షారుక్ ఖాన్ ఇమేజ్ మొత్తాన్ని మార్చేసిన సినిమా ఇది. బాలీవుడ్ తో పాటు అన్ని భాష‌ల్లోనూ మంచి పేరు తీసుకొచ్చిన చిత్ర‌మది. కానీ ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఆ స‌క్సెస్ పుల్ కాంబినేష‌న్ చేతులు క‌లిపి సినిమా చేసింది లేదు.

బాలీవుడ్ లో షారుక్ ఖాన్ బిజీగా సినిమాలు చేసుకుంటే..కోలీవుడ్ లో మ‌ణిర‌త్నం త‌న సినిమాల‌తో తాను బిజీగా ఉన్నారు. కానీ వాళ్లిద్ద‌రి కాంబినేష‌న్ లో మ‌రో సినిమా చూడాల‌న్న‌ది అభిమానుల కోరిక‌. ఇది ఇప్ప‌టిది కాదు దిల్ సే హిట్ అయిన ద‌గ్గ‌ర నుంచి ఇద్ద‌రు క‌లిసి మ‌రో సినిమా చేస్తే బాగుండని ఎన్నో సార్లు అభిమానులు ఆ ఇద్ద‌ర్ని అడిగారు. కానీ అది ఇంత‌వ‌ర‌కూ సాధ్య‌ప‌డ‌లేదు. చివ‌రికి షారుక్ ఖాన్ కూడా త‌న ఇమేజ్ మొత్తాన్ని ప‌క్క‌న‌బెట్టి అడుక్కున్నా! స‌రే మ‌ణిర‌త్నం మాత్రం నో అని డైరెక్ట్ గా చెప్ప‌లేక అలా ఎస్కేప్ అవుతున్నార‌ని ఆయ‌న మాట‌ల్ని బ‌ట్టి తెలుస్తోంది.

ఓ వేడుక‌లో మ‌ణిర‌త్నం..షారుక్ ఖాన్ పాల్గొన్నారు. వేదిక‌పై షారుక్ ఖాన్ ఉంటే? మ‌ళ్లీ మీ ఇద్ద‌రు సినిమా ఎప్పుడు చేస్తున్నారంటే? సంభాష‌ణ‌లో ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటు చేసుకుంది. మణి సర్ మిమ్మల్ని ఎన్నిసార్లు అడుక్కున్నాను.. మళ్లీ నాతో సినిమా చేయమని అడిగాను.. బెగ్గింగ్ చేశాను..ఈ సారి మీరు సినిమా చేస్తే ట్రైన్‌లో ఏంటి.. ప్లేన్ మీద చయ్యా చయ్యా అని డ్యాన్స్ వేస్తాను అన్నాడు షారుక్.

అందుకు మ‌ణిర‌త్నం న‌వ్వుతూ స‌మాధానం ఇచ్చారు. 'నేను ప్లెయిన్ కొన్న తరువాత చేస్తా'అని అన్నారు. మరి నేను కొంటే ఓకేనా? అని షారుఖ్ అంటాడు. అందుకు ఒకే అంటారు మ‌ణిసార్. సర్ నా సినిమాలు ఎలా ఆడుతున్నాయో తెలుసుగా.. అవి కొనడం పెద్ద విషయం కాదు. గాల్లో డ్యాన్స్ చేస్తా..ప్లేన్ మీద చేస్తా అని షారుఖ్ అంటుంటే.. నిన్ను కిందకు దింపుతాగా అని మణిరత్నం న‌వ్వేసారు.