Begin typing your search above and press return to search.

నేచుర‌ల్ స్టార్ డ్రీమ్ నెర‌వేరుతోందా?

ఇండియ‌న్ సినీ హిస్ట‌రీలో త‌మ కంటూ ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న స్టార్ డైరెక్ట‌ర్లు ఎంద‌రో ఉన్నారు. వారిలో లెజెండ‌రీ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నంది ప్ర‌త్యేక శైలి.

By:  Tupaki Desk   |   17 Dec 2025 8:00 PM IST
నేచుర‌ల్ స్టార్ డ్రీమ్ నెర‌వేరుతోందా?
X

ఇండియ‌న్ సినీ హిస్ట‌రీలో త‌మ కంటూ ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న స్టార్ డైరెక్ట‌ర్లు ఎంద‌రో ఉన్నారు. వారిలో లెజెండ‌రీ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నంది ప్ర‌త్యేక శైలి. త‌న‌దైన మార్కు సినిమాల‌ని తెర‌పై అందంగా ఆవిష్క‌రించ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. `ప‌ల్ల‌వి అనుప‌ల్ల‌వి` నుంచి నిన్న‌టి థ‌గ్ లైఫ్ వ‌ర‌కు త‌న మార్కు సినిమాల‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తున్నారు. అయితే రీసెంట్‌గా విడుద‌లైన `థ‌గ్ లైఫ్‌` మ‌ణిర‌త్నం మార్కు స‌క్సెస్‌ని మాత్రం అందుకోలేక‌పోయింది.

దీంతో ఆలోచ‌న‌లో ప‌డ్డ మ‌ణిర‌త్నం ప‌దేళ్ల క్రితం అనుస‌రించిన ఫార్ములానే ఫాలో కాబోతున్నాడ‌ట‌. ప‌దేళ్ల క్రితం వ‌రుస ఫ్లాపుల్ని ఎదుర్కొన్న ఈ లెజెండ‌రీ డైరెక్ట‌ర్ త‌న‌కు బాగా క‌లిసి వ‌చ్చిన రొమాంటిక్ డ్రామాని న‌మ్ముకుని `ఓకే బంగారం` పేరుతో ల‌వ్ స్టోరీని తెర‌కెక్కించి హిట్టు కొట్టాడు. మ‌ళ్లీ ట్రాక్‌లోకొచ్చాడు. స‌రిగ్గా ఇప్పుడు అదే పంథాని అనుస‌రించి త‌దుప‌రి మూవీని రొమాంటిక్ ల‌వ్ స్టోరీగా చేయాల‌నే ప్లాన్‌లో ఉన్నాడ‌ట‌. రెగ్యుల‌ర్ రొమాంటిక్ మూవీస్‌కి భిన్నంగా మ‌ణిసార్ ఈ సారి కాప్ ల‌వ్ స్టోరీని తెర‌పైకి తీసుకురాబోతున్నాడు.

ఇప్ప‌టికే ప‌ట్టాలెక్కాల్సిన ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగ‌లేదు. కార‌ణం స్టోరీకి త‌గ్గ కాస్టింగ్ కుద‌ర‌క‌పోవ‌డ‌మేన‌ట‌. గ‌త ఆరు నెల‌లుగా మంచి కాస్టింగ్ కోసం మ‌ణిర‌త్నం అన్వేషిస్తున్నార‌ట‌. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం విక్ర‌మ్ త‌న‌యుడు దృవ్‌ని, లేటెస్ట్ సెన్సేష‌న్ రుక్మిణి వాసంత్‌ని ఫైన‌ల్ చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టుగా కోలీవుడ్ లో ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రో ప్ర‌చారం ఏంటంటే వాళ్లు సెట్ట‌వ్వ‌క‌పోతే ఈ ప్రాజెక్ట్‌ని విజ‌య్ సేతుప‌తి, సాయి ప‌ల్ల‌వితో తీసే ఆలోచ‌న కూడా మ‌ణిర‌త్నం చేస్తున్నార‌ని వార్త‌లు షికారు చేస్తున్నాయి.

అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్‌లో టాలీవుడ్ నేచుర‌ల్ స్టార్ నాని న‌టించే అవ‌కాశం ఉంద‌ని, ఈ సినిమాతో మ‌ళ్లీ నాని కోలీవుడ్ వైపు అడుగులు వేయ‌బోతున్నాడ‌ని మ‌రో టాక్‌. లెజెండ‌రీ డైరెక్ట‌ర్ మ‌ణిరత్నంతో సినిమా చేయాల‌ని నాని డ్రీమ్‌. ఆ డ్రీమ్ ఈ సినిమాతో నెర‌వేరే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. అంతే కాకుండా మ‌ణిరత్నం ఈ ప్రాజెక్ట్ కోసం నానిని ఫైన‌ల్ చేశార‌ని, వ‌చ్చే మార్చి నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని ఇన్ సైడ్ టాక్‌.

నాని గ‌తంలో మ‌ణిర‌త్నం డైరెక్ట్ చేసిన `ఓకే బంగారం` మూవీ కోసం దుల్క‌ర్ స‌ల్మాన్‌కు డ‌బ్బింగ్ చెప్ప‌డం తెలిసిందే. అప్పుడే త‌న డ్రీమ్‌ని బ‌య‌ట‌పెట్టిన నాని ఇన్నాళ్ల‌కు ఆ డ్రీమ్‌ని నెర‌వేర్చుకోబోతున్నాడ‌ని టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మ‌న్న‌ది తెలియాలంటే మ‌ణిర‌త్నం అధికారికంగా ఈ ప్రాజెక్ట్ గురించి ప్ర‌క‌టించే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.