లెజెండరీ డైరెక్టర్‌తో క్రేజీ కాంబో?
ఇందు కోసం విలక్షణ హీరో విజయ్ సేతుపతి, సాయిపల్లవి వంటి క్రేజీ ఆర్టిస్ట్‌లతో రేర్ కాంబినేషన్‌ని సెట్ చేస్తున్నట్టుగా కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.
By: Ravindar Gorantla | 23 Feb 2026 1:08 PM ISTవరుస డిజాస్టర్లు, ఫ్లాపుల తరువాత ట్రాక్‌లోకి వచ్చిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం. క్రేజీ జోడీ దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా ఆయన తెరకెక్కించిన రొమాంటిక్ డ్రామా `ఓకే బంగారం`. ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ డూపర్ హిట్ కావడంతో మణిరత్నం మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేశారు. ఆ తరువాత మళ్లీ డిజాస్టర్ ఎదుర్కొన్న ఆయన `చెక్క చివంత వానం`తో మళ్లీ సక్సెస్ అందుకున్నారు. కమల్ చేసిన `థగ్ లైఫ్`తో మళ్లీ రేసులో వెనబడిపోయారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిస్‌ఫైర్ అయింది.
దీంతో మళ్లీ ఆలోచనలో పడిన ఈ లెజెండరీ డైరెక్టర్ ఈ సారి మరో కొత్త స్టోరీతో, సరికొత్త కాంబినేషన్‌లో ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్ చేయడానికి రెడీ అవుతున్నట్టుగా కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ క్రేజీ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా కోసం కొత్త కాంబినేషన్‌ని మణిరత్నం సెట్ చేస్తున్నారట. ఈ మూవీ కోసం విలక్షణ హీరో విజయ్ సేతుపతిని ఇప్పటికే ఫైనల్ చేసిన మణిరత్నం హీరోయిన్‌గా క్రేజీ స్టార్ సాయి పల్లవిని ఎంపిక చేసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. `రోజా` నుంచి మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్‌ని అందిస్తూ వస్తున్న ఏ.ఆర్. రెహమాన్ ఈ మూవీకి కూడా మ్యూజిక్ చేయబోతున్నాడు.
ఈ క్రేజీ మూవీని ప్రముఖ కోలీవుడ్ ప్రొడక్షన్ కంపనీ లైకా ప్రొడక్షన్స్ నిర్మించబోతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వవరాలు త్వరలోనే అధికారికంగా మేకర్స్ ప్రకటించనున్నారని కోలీవుడ్ అప్ డేట్. గత కొంత కాలం క్రితం వరుస ఫ్లాపులతో సతమతమైన మణిరత్నం మళ్లీ ట్రాక్‌లోకి రావడానికి రొమాంటిక్ లవ్ స్టోరీనే నమ్ముకున్నారు. అలా చేసిన `ఓకే బంగారం`తో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చారు. ఈ సారి కూడా అదే ఫార్ములాని ఫాలో అవుతూ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాకు శ్రీకారం చుట్టబోతున్నారట.
ఇందు కోసం విలక్షణ హీరో విజయ్ సేతుపతి, సాయిపల్లవి వంటి క్రేజీ ఆర్టిస్ట్‌లతో రేర్ కాంబినేషన్‌ని సెట్ చేస్తున్నట్టుగా కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఏంటీ? ఇందులో నటీంచే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో లైకా ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించనుందని ఇన్ సైడ్ టాక్. ఇప్పటికే తమిళంలో ధనుష్ హీరోగా నటిస్తున్న తన 55వ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. `అమరన్` ఫేమ్ రాజ్ కుమార్ పెరియసామి ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు.
`మారి 2` తరువాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న రెండవ సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. `మారి 2`లో ప్రభుదేవా కంపోజ్ చేసిన `రౌడీ బేబీ` యూట్యూబ్‌లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో తాజా మూవీలో మరో సారి ఈ జోడీ ఇలాంటి మ్యాజిక్‌ని చేసే అవకాశం ఉందని, రాజ్ కుమార్ పెరియసామి రూపొందించిన `అమరన్` సాంగ్స్ తరహాలోనే ఇందులోనూ బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఉంటాయని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
