ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?
తమిళ, తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ త్వరలోనే వచ్చేలా వార్తలు వినిపిస్తున్నాయి.
By: Priya Chowdhary Nuthalapti | 5 Nov 2026 8:00 AM ISTతమిళ, తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ త్వరలోనే వచ్చేలా వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయానికి వస్తే..ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం తన తదుపరి సినిమా కోసం తమిళ స్టార్ హీరోలు సూర్య, ధనుష్‌తో పాటు తెలుగు హీరో నానిని పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ముగ్గురు హీరోలు ఒకే సినిమాలో నటిస్తే, అది నిజంగానే ఒక క్రేజీ మల్టీస్టారర్‌గా మారే అవకాశం ఉంది.
సూర్య, ధనుష్ ఇద్దరూ తమిళంలో మంచి గుర్తింపు ఉన్న నటులు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక ఈ ఇద్దరు హీరోలకు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా తమిళ హీరో సూర్య ని మన తెలుగు వాళ్ళు సొంత హీరో లాగా ఫీల్ అవుతారు. ఇక నాని సినిమా అంటే మన తెలుగులో ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఈ క్రమంలో వీళ్ళ ముగ్గురితో కలిసి..మణిరత్నం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కితే తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ రావడం ఖాయం. ముఖ్యంగా నాని ఈ ప్రాజెక్టులో భాగమైతే తెలుగు మార్కెట్‌పై కూడా ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడుతుంది. మూడు భాషల ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో ఈ సినిమా రూపొందితే భారీ ఓపెనింగ్స్ అలానే భారీ కలెక్షన్లు కూడా తెచ్చి పెట్టడం ఖాయం.
మణిరత్నం గతంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించారు. అయితే ఇటీవల ఆయన తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్’ భారీ బడ్జెట్‌తో, స్టార్ నటీనటులతో రూపొందినప్పటికీ తమిళనాడులోనే ఎక్కువగా ఆదరణ పొందింది. ఇతర భాషల్లో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.
ఈ నేపథ్యంలో సూర్య, ధనుష్‌లతో పాటు నానిని తీసుకోవాలనే ఆలోచన నిజమైతే, తెలుగు మార్కెట్‌పై కూడా మణిరత్నం దృష్టి పెట్టినట్లు భావించవచ్చు. మరి ఈ కాంబినేషన్ నిజమవుతుందా.. మణిరత్నం తన పాత మ్యాజిక్‌ను మరోసారి చూపిస్తారా.. అనేది తెలియాలి అంటే ముందుగా ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రావాలి.
