మణిరత్నం ప్రేమకథలో కన్నడ సుందరి..!
ఫైనల్ గా నెక్స్ట్ ఒక లవ్ స్టోరీతో వస్తున్నారట. ఐతే ఈ సినిమాలో హీరోయిన్ గా కన్నడ భామ రుక్మిణి వసంత్ ని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.
By: Tupaki Desk | 30 May 2025 7:00 AM ISTఇప్పుడు కాదు రెండు దశాబ్దాల క్రితమే పాన్ ఇండియా డైరెక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్నారు మణిరత్నం. ఆయన సినిమా వస్తుంది అంటే ఏజ్ తో సంబంధం లేకుండా ఆడియన్స్ అంతా కూడా ఆసక్తిగా ఉంటారు. మణిరత్నం సినిమాల్లో ఛాన్స్ కోసం హీరోలు, హీరోయిన్స్ కూడా ఎదురుచూస్తుంటారు. డైరెక్టర్ గా అన్ని రకాల సినిమాలు చేసి చూపించారు మణిరత్నం. ముఖ్యంగా ఆయన డైరెక్షన్ లో ప్రేమకథ వస్తే మాత్రం అది వేరే లెవెల్ అనిపించేలా ఉంటుంది.
పొన్నియిన్ సెల్వన్ 1, 2 సినిమాలతో వచ్చిన మణిరత్నం త్వరలో థగ్ లైఫ్ తో రాబోతున్నారు. కమల్ హాసన్ తో దాదాపు 3 దశాబ్ధాల తర్వాత థగ్ లైఫ్ ని చేశారు. ఐతే ఈ సినిమా తర్వాత మరోసారి తన మార్క్ లవ్ స్టోరీతో రాబోతున్నారని తెలుస్తుంది. మణిరత్నం ప్రేమకథతో ఈసారి తమిళ స్టార్ హీరో శింబు నటిస్తాడని తెలుస్తుంది. మణిరత్నం థగ్ లైఫ్ లో శింబు కూడా నటించాడు. ఈ సినిమా షూటింగ్ టైం లోనే శింబుతో మరో సినిమా చేయాలని ఫిక్స్ అయినట్టు ఉన్నారు మణిరత్నం.
ఫైనల్ గా నెక్స్ట్ ఒక లవ్ స్టోరీతో వస్తున్నారట. ఐతే ఈ సినిమాలో హీరోయిన్ గా కన్నడ భామ రుక్మిణి వసంత్ ని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. కన్నడలో యువ హీరోయిన్ గా రాణిస్తున్న రుక్మిణి సప్త సాగరాలు దాటి సినిమాలో తన నటనతో సౌత్ ఆడియన్స్ ని మెప్పించింది. ఆ సినిమా తర్వాత ఆమెకు తెలుగు తమిళ్ నుంచి వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఆల్రెడీ తెలుగులో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో మూవీ ఛాన్స్ వచ్చిందని తెలుస్తుంది.
ఇప్పుడు అమ్మడు మణిరత్నం సినిమా ఆఫర్ కూడా అందుకుందని తెలుస్తుంది. మణిరత్నం మూవీ అవకాశం అనగానే రుక్మిణి ఫ్యాన్స్ లో సూపర్ ఎగ్జైట్ మెంట్ మొదలైంది. కన్నడలో నటిస్తున్నా సరే రుక్మిణికి మిగతా భాషల్లో నుంచి వస్తున్న అవకాశాలు అన్నీ కూడా ఆమెకు స్టార్ ఇమేజ్ తెచ్చేలా ఉంది. మరి రుక్మిణి వసంత్ ఈ సినిమాల వల్ల ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి. తారక్ తో సినిమా తర్వాత అమ్మడు ఎలాగు తెలుగులోనే బిజీ హీరోయిన్ అయ్యే ఛాన్స్ లు ఉన్నాయి. ఐతే మణిరత్నం సినిమా చేశాక తమిళ్ లో కూడా రుక్మిణి బిజీ అయ్యే అవకాశం లేకపోలేదు.
