మణిరత్నం తదుపరి హీరో ఇతడేనా?
`థగ్ లైఫ్` ఆన్ సెట్స్ లో ఉండగానే మణిరత్నం తన మార్క్ లవ్ స్టోరీలు చేస్తానని ప్రకటించారు.
By: Tupaki Desk | 18 May 2025 1:49 PM IST`థగ్ లైఫ్` ఆన్ సెట్స్ లో ఉండగానే మణిరత్నం తన మార్క్ లవ్ స్టోరీలు చేస్తానని ప్రకటించారు. తగ్ లైఫ్ రిలీజ్ సమయం దగ్గర పడటంతో మణిసార్ అప్పుడే ప్రాజెక్ట్ పనులు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే లవ్ స్టోరీకి సంబంధించి స్క్రిప్ట్ సిద్దంగా ఉందని అప్పట్లో ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమా ద్వారా కొంత మంది కొత్త నటీనుటుల్ని పరిచయం చేస్తున్నట్లు వార్తలొచ్చాయి.
అలాగని పూర్తిగా వాళ్లపై ఆధార పడకుండా కొంత ప్యాడింగ్ కూడా యాడ్ చేసుకుంటున్నట్లు విని పించింది. తాజాగా ఆ స్టోరీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులను టీమ్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ యువ నటుడు నవీన్ పొలిశెట్టిని ఓ హీరోగా ఎంపిక చేసినట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం మొదలైంది. నాలుగు కీలక మైన పాత్రలుండగా ఓ పాత్రకు నవీన్ తీసుకుంటున్నట్లు వినిపిస్తుంది.
నవీన్ కు జోడీగా ఓ పేరున్న హీరోయిన్ ని కూడా తీసుకుంటున్నారుట. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలి. ఇదే నిజమైతే నవీన్ కిది గొప్ప అవకాశమే. టాలీవుడ్ ట్యాలెంటెడ్ నటుల్లో నవీన్ ఒకడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిచయమై హీరోగా మారాడు. `జాతిరత్నాలు`తో మంచి పేరొచ్చింది. అనుష్కకు జంటగా `మిసెస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి`లోనూ నటించాడు. కానీ ఈసినిమా తర్వాత సరైన అవకాశాలు రాలేదు.
ప్రస్తుతం చేతిలో ఒకే ఒక్క అవకాశం ఉంది. అదే `అనగనగా ఒక రోజు` . ఇదీ వచ్చే ఏడాది వరకూ రిలీజ్ అవ్వదు. ఈ లోపే మణిరత్నం ప్రాజెక్ట్ మొదలవుతుంది. రిలీజ్ కు పెద్దగా సమయం పట్టదు. ఏడాది చివర్లో గానీ...వచ్చే ఏడాది ఆరంభంలో గానీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. నవీన్ కున్న యూత్ ఫాలోయింగ్ కి సరైన లవ్ స్టోరీ పడితే? లవర్ బోయ్ ఇమేజ్ తో తిరుగులేని స్థాయికి వెళ్తాడు. మణిరత్నం సినిమాతో ఆఛాన్స్ ఉంది.
