నవీన్ పోలిశెట్టితో సినిమాపై మణిరత్నం క్లారిటీ
టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా మణిరత్నం ఒక సినిమా చేస్తున్నాడని సోషల్ మీడియాలో చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది.
By: Tupaki Desk | 27 May 2025 12:28 PM ISTప్రముఖ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో లెజెండరీ నటుడు కమల్‌హాసన్ హీరోగా తెరకెక్కిన థగ్ లైఫ్ సినిమా వచ్చే నెల 5వ తేదీన వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్‌లో సినీ యూనిట్ మొత్తం బిజీబిజీగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా డైరెక్టర్ మణిరత్నం తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తెలుగు హీరో నవీన్ పోలిశెట్టి గురించి మణిరత్నం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
సాధారణంగా మణిరత్నం కొత్త హీరోలతో ఎక్కువగా సినిమాలు చేయరు. దిగ్గజ హీరోలు, వెటరన్ నటులతోనే ఎక్కువ సైతం ప్రాజెక్టులను మణిరత్నం ప్లాన్ చేస్తారు. చివరిసారిగా ఆయన ఓ యువ హీరోతో తెరకెక్కించిన చిత్రం ఓకే కన్మణి. దుల్కర్ సల్మాన్‌తో తీసిన ఈ సినిమా మంచి హిట్ సాధించింది. ఆ తర్వాత మాత్రం ఆయన కొత్త తరంతో మరో సినిమా తీయలేదు. అయితే, తాజాగా థగ్ లైఫ్ మూవీ ప్రమోషన్స్‌లో దీని గురించి మణిరత్నం క్లారిటీ ఇచ్చారు.
టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా మణిరత్నం ఒక సినిమా చేస్తున్నాడని సోషల్ మీడియాలో చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇందులో రుక్మిణి వసంత్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారని కూడా సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో మణిరత్నంను ప్రశ్నించగా అలాంటిదేమి లేదని బదులిచ్చారు. మీరు అడిగిన విషయం తనకు కూడా ఇప్పుడు ఒక వార్తలా అనిపిస్తుందని మణిరత్నం చెప్పారు.
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం గురించి తనకు ఏ మాత్రం అవగాహన లేదని మణిరత్నం స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను పలు కథలపై కసరత్తు చేస్తున్నానని, అందులో తర్వాత ఏ కథను తెరకెక్కిస్తాననేది కూడా తనకు తెలియదని మణిరత్నం చెప్పారు. అయితే మణిరత్నం సినిమాలను సెట్ చేయడానికి పెద్దగా టైమ్ తీసుకోరు. వాస్తవానికి పొన్నియన్ సెల్వన్-2 తర్వాత థగ్ లైఫ్ సినిమాను తెరకెక్కించడానికి కూడా మణిరత్నం ఎక్కువ సమయం తీసుకోలేదు. ప్రస్తుతం తాను చాలా కథలపై వర్క్ చేస్తున్నానని, వాటిలో ఏ ప్రాజెక్టు ముందు సెట్స్ పైకి వెళ్తుందో తనక్కూడా క్లారిటీ లేదని మణిరత్నం చెప్పారు.
