Begin typing your search above and press return to search.

కమ్ముల సినిమా మిస్ చేసుకున్న మంగ్లీ.. నిజమేనా..

టాలీవుడ్ లో ఆమె సాంగ్ లేకుండా సినిమా రావడం లేదంటే ఏ స్థాయిలో ఇంపాక్ట్ చూపిస్తోందో అర్ధం చేసుకోవచ్చు.

By:  Tupaki Desk   |   12 Dec 2023 4:14 AM GMT
కమ్ముల సినిమా మిస్ చేసుకున్న మంగ్లీ.. నిజమేనా..
X

టాలీవుడ్ లో స్టార్ సింగర్ గా దూసుకుపోతున్న మంగ్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. న్యూస్ యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన మంగ్లీ తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో పాపులర్ అయ్యింది. తనదైన స్వరంతో ప్రత్యేకత చాటుకొని ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ ద్వారా విశేషమైన గుర్తింపు దక్కించుకుంది. తరువాత సింగర్ గా సినిమాలలో ఛాన్స్ లు రావడమే కాకుండా ఆమె పాటలు సూపర్ హిట్ అయ్యాయి.

దీంతో గాయనిగా వరుస అవకాశాలు అందుకుంటూ తిరుగులేని ఇమేజ్ తో స్టార్ సింగర్ గా మంగ్లీ దూసుకుపోతోంది. టాలీవుడ్ లో ఆమె సాంగ్ లేకుండా సినిమా రావడం లేదంటే ఏ స్థాయిలో ఇంపాక్ట్ చూపిస్తోందో అర్ధం చేసుకోవచ్చు. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని సింగర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని మంగ్లీ క్రియేట్ చేసుకుంది. ఫోక్, డివోషనల్, మోడరన్ టచ్ తో అన్ని రకాల జోనర్స్ లో సాంగ్స్ పాడుతోంది.

అయితే నటిగా కూడా మంగ్లీ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ అన్నింటిలో తన పాటలకి తానే డాన్స్ పెర్ఫార్మెన్స్ తో వీడియో సాంగ్స్ చేస్తూ ఉంటుంది. ఈ కారణంగా నటిగా కూడా ఆమెకి సరైన పాత్రలు పడితే దూసుకుపోయే చరిష్మా ఉందనే టాక్ టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో చాలా మంది మంగ్లీ లీడ్ రోల్ లో సినిమాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు.

ఆమె మాత్రం లీడ్ రోల్స్ సున్నితంగా తిరస్కరిస్తోంది. అలాగే ఒక సూపర్ హిట్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ని మంగ్లీ వదులుకుంది అనే టాక్ వినిపిస్తోంది. సాయి పల్లవి హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అయిన శేఖర్ కమ్ముల ఫిదా సినిమాలో మొదటిగా మంగ్లీని హీరోయిన్ గా అడిగారంట. అయితే ఆమెకి హీరోయిన్ గా చేయడం ఇష్టం లేకపోవడం చేయనని చెప్పిందంట.

శేఖర్ కమ్ముల తర్వాత చాలా మంది హీరోయిన్స్ ని ప్రయత్నం చేసి ఫైనల్ గా సాయి పల్లవిని ఒకే చేశారు. ఫిదా సినిమా సాయి పల్లవి ఇమేజ్ ని అమాంతం పెంచేసింది. తెలుగులో స్టార్ యాక్టర్ గా ఆ సినిమాతో మారిపోయింది. అలా ఫిదా సినిమా ఛాన్స్ మంగ్లీ వదులుకుంటే సాయి పల్లవికి వచ్చిందనే ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది.