సింగర్ మంగ్లీ బర్త్‌డే పార్టీపై దివి ఏమందంటే..!
సింగర్ మంగ్లీ బర్త్‌డే పార్టీ వివాదాస్పదంగా మారింది. బర్త్‌డే పార్టీలో గంజాయి, విదేశీ మద్యం లభించినట్టుగా పోలీసులు తెలిపారు.
By: Tupaki Desk | 11 Jun 2025 4:58 PM ISTసింగర్ మంగ్లీ బర్త్‌డే పార్టీ వివాదాస్పదంగా మారింది. బర్త్‌డే పార్టీలో గంజాయి, విదేశీ మద్యం లభించినట్టుగా పోలీసులు తెలిపారు. దీంతో ఒక్కసారిగా మగ్లీ వార్తల్లో నిలిచింది. మంగ్లీ పుట్టిన రోజు సందర్భంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని ఈర్లపల్లి శివారులో గల ఓ రిసార్టులో స్నేహితులకు మంగళవారం రాత్రి మంగ్లీ పార్టీ ఇచ్చింది. ఈ పార్టీలో 50 మంది వరకు కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు.
వీరిలో సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా ఉన్నట్లుగా సమాచారం. మంగ్లీ బర్త్‌డే పార్టీ అర్థ్రరాత్రి వరకు జరగడంతో ఈ పార్టీలో విదేశీ మధ్యం, గంజాయి వినియోగించారని స్థాయిక పోలీసులకు సమాచారం అందడంతో అర్థ్రరాత్రి 2 గంటల సమయంలో ఎస్ ఓటీ పోలీసులు రిసార్ట్‌పై దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే సింగర్ మంగ్లీ, రిసార్ట్ నిర్వహకుడు, పార్టీ నిర్వాహకుడు, టెస్టుల్లో పాజిటివ్‌గా తెలిన ఓ వ్యక్తిపై కేసులు నమోదు చేశారు.
దీంతో మంగ్లీ బర్త్‌డే పార్టీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారి సంచలనం సృష్టిస్తోంది. మంగ్లీ బర్త్‌డే పార్టీలో బిగ్ బాస్ ఫేమ్ దివి కూడా పాల్గొనడంతో తనపై కూడా వరుస కథనాలు మొదలయ్యాయి. దీనిపై తాజాగా దివి విరణ ఇస్తూ మీడియాకు ఓ ఆడియోని విడుదల చేసింది. `మీడియా మిత్రులందరికీ చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్ బర్త్‌డే పార్టీ అని వెళితే..అక్కడ జరిగిన తప్పుల్ని మాపై తోయడం తప్పుకదాండి. మీరు కూడా చూసి దాన్ని బట్టి నిజంగా ఏమైనా ఆధారాలు ఉంటే నేను కూడా తప్పులు చేశానని అనుకుంటే నా ఫోటో వేయండి.
కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా మీడియా మిత్రులు నా ఫోటో యూజ్‌చేసి నెగెటివ్‌గా ప్రచారం చేస్తే నాకు, నా కెరీయర్‌కు ఎంత ఇబ్బందిగా ఉంటుందో అర్థం చేసుకోండి. ఎంతో కష్టపడి నేను ఈ స్థాయికి వచ్చాను.మీరు కూడా సాధారణంగా ఫ్రెండ్ బర్త్‌డే అంటే వెళతారు. అలాగే నాకు మంగ్లీ మంచి ఫ్రెండ్ కాబట్టే తన బర్త్‌డే పార్టీకి వెళ్లాను. అయితే అక్కడ జరిగిన పరిస్థితులకు నేను కూడా బాధ్యురాలిని అని నా ఫోటోని పెట్టి న్యూస్ వేయడం తప్పండి` అంటూ ఆడియోని విడుదల చేసింది.