Begin typing your search above and press return to search.

మంగళవారం ఫస్ట్ డే బాక్సాఫీస్.. ఎంత వచ్చాయంటే?

అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ శుక్రవారం విడుదలైన మంగళవారం సినిమా డీసెంట్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   18 Nov 2023 11:43 AM GMT
మంగళవారం ఫస్ట్ డే బాక్సాఫీస్.. ఎంత వచ్చాయంటే?
X

అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ శుక్రవారం విడుదలైన మంగళవారం సినిమా డీసెంట్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. థ్రిల్లర్ పాయింట్ తో వచ్చిన ఈ సినిమాలో కొన్ని ట్విస్ట్ లు సినిమాకు చాలా బాగా హెల్ప్ అయ్యాయి. దానికి తోడు పాయల్ రాజ్ పూత్ నటన కూడా సినిమాల్లో హైలైట్ గా నిలిచింది. ఏదేమైనా కూడా ఈ సినిమాతో ఆమె పాజిటివ్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతుంది అనే నమ్మకాన్ని కలిగించింది.

ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది అనే వివరాల్లోకి వెళితే. సినిమాకు ఎక్కువ స్థాయిలో బ్యాడ్ టాక్ అయితే రాలేదు. ఒకసారి చూడొచ్చు అనే తరహాలో రివ్యూలు కూడా వచ్చాయి దీంతో కొన్ని మాస్ ఏరియాలలో మొదటి రోజు మంగళవారం థియేటర్స్ కళకళలాడాయి.

అలాగే మల్టీప్లెక్స్ సెంటర్లలో కూడా ఫస్ట్ షో నుంచి కలెక్షన్స్ పెరుగుతూ వచ్చాయి. ఇక మంగళవారం సినిమా నైజాం లో మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఆంధ్ర ఏరియాలను కూడా ఈ సినిమాకు డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా మంగళవారం సినిమా మొదటి రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రెండు కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ అయితే రాబట్టింది.

ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో చూసుకుంటే అటువైపు నుంచి ఈ సినిమా 28 లక్షల షేర్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా మంగళవారం సినిమా 2.30 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ 4.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు సమాచారం. ఒక విధంగా ఇవి మంచి నెంబర్స్ అనుకున్నప్పటికీ సినిమా చేసిన బిజినెస్ ను బట్టి చూస్తే ఇంకా ఎక్కువగా రాబట్టి ఉండే బాగుండేది.

ఎందుకంటే ఈ సినిమా థియేట్రికల్ గా దాదాపు 13 కోట్ల రేంజ్ లో అయితే బిజినెస్ చేసింది. ఇంకా ప్రాఫిట్ లోకి రావాలి అంటే 10 కోట్లకు పైగానే షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంటుంది. ఇక శనివారం మంచి కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఆదివారం వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఉండడం వలన ప్రభావం పడవచ్చు. మరి మిగతా రోజుల్లో సినిమా పుంజుకుంటుందో లేదో చూడాలి.