Begin typing your search above and press return to search.

`మంగ‌ళ‌వారం` ప్రీక్వెల్..సీక్వెల్ ఇప్ప‌ట్లో సాధ్య‌మేనా?

ఇటీవ‌లే రిలీజ్ అయిన `మంగ‌ళ‌వారం` పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. విమ‌ర్శ‌కులు మెచ్చిన చిత్రంగా నిలిచింది. బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్లు బాగున్నాయి.

By:  Tupaki Desk   |   20 Nov 2023 7:21 AM GMT
`మంగ‌ళ‌వారం` ప్రీక్వెల్..సీక్వెల్ ఇప్ప‌ట్లో సాధ్య‌మేనా?
X

ఇటీవ‌లే రిలీజ్ అయిన `మంగ‌ళ‌వారం` పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. విమ‌ర్శ‌కులు మెచ్చిన చిత్రంగా నిలిచింది. బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్లు బాగున్నాయి. పోటీగా ఏ సినిమా కూడా లేక‌పోవడంతో మంగ‌ళ వారం వ‌సూళ్లు పెరుగుతున్నాయి. పాయ‌ల్ రాజ్ పుత్ కి...అజ‌య్ భూపతికి చాలా కాలం త‌ర్వాత వ‌చ్చిన స‌క్సెస్ ఇది. ఇద్ద‌రు చాలా కాలంగా విజ‌యం కోసం ఎదురు చూస్తున్నారు. `ఆర్ ఎక్స్ 100` త‌ర్వాత ఇద్ద‌రికీ స‌రైన స‌క్సెస్ లేదు.

చేసిన సినిమాలేవి ఆశించిన ఫ‌లితాన్నివ్వ‌లేదు. దీంతో అజ‌య్ త‌న శైలికి భిన్నంగా` మంగ‌ళ‌వారం`తో కొత్త ప్ర‌యత్నం చేసి స‌క్సెస్ అయ్యాడు. ఈ ప్రాజెక్ట్ లోకి పాయ‌ల్ కూడా అనుకోకుండా వ‌చ్చింది. ఓ కొత్త హీరోయిన్ తో తీయాల్సిన సినిమాని పాయ‌ల్ కోరిక మేర‌కు అజ‌య్ ఆమెని ఎంపిక చేయ‌డం సినిమాకి ప్లస్ అయింది. ఆ ర‌కంగా మంగ‌ళ‌వారం ఆ ఇద్ద‌రికీ ఊహించ‌ని స‌క్సెస్ అనే చెప్పాలి.

ఇక ఈ సినిమా రిలీజ్ కి మందు అజ‌య్ భూప‌తి సీక్వెల్..ప్రీక్వెల్ కూడా చేయోచ్చ‌ని అన్నారు. అయితే అజ‌య్ ఇప్పుడు ఆదిశ‌గా ఆలోచ‌న చేస్తాడా? కొత్త క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు వస్తాడా? అన్న‌ది చూడాలి. సాధార‌ణంగా రిలీజ్ కి ముందే ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు వ‌స్తుంటాయి. కానీ ప్రాంచైజీని కొన‌సాగించాలా? వ‌ద్దా? అన్న‌ది బాక్సాఫీస్ ఫ‌లితం మీద ఆధార‌ప‌డి ఉంటాయి. `మంగ‌ళ‌వారం` విజ‌యం నేప‌థ్యంలో అజ‌య్ ఇప్ప‌టికిప్పుడు సీక్వెల్..ప్రీక్వెల్ ప్లాన్ చేస్తారా? లేదా? అన్న‌ది చూడాలి.

`ఆర్ ఎక్స్ -100` త‌ర్వాత అజ‌య్ తెర‌కెక్కించిన `మ‌హాస‌ముద్రం` డిజాస్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. రోటీన్ కంటెంట్ గా తేలిపోయింది. కానీ మంగ‌ళ‌వారం వైవిథ్యంగా ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంది. ఈ మ‌ధ్య కాలంలో స‌స్సెన్స్ థ్రిల్ల‌ర్ కి పాజిటివ్ టాక్ వ‌స్తే వ‌సూళ్లు భారీగా ఉంటున్నాయి. స్టార్ ఇమేజ్ తో ప‌నిలేకుండా ప్రేక్ష‌కులు ఆ జాన‌ర్ చిత్రాల్ని ఆస్వాదిస్తున్నారు. మ‌రి ఈ విజ‌యాన్ని అజ‌య్ ఎలా మ‌లుచుకుంటాడు? అన్న‌ది చూడాలి.