Begin typing your search above and press return to search.

మంగళవారం.. ఆ నటి పాయల్ కంటే ఎక్కువ షాక్ ఇచ్చింది

ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన 'మంగళవారం' మూవీ గత శుక్రవారం ప్రేక్షకులు ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.

By:  Tupaki Desk   |   20 Nov 2023 8:06 AM GMT
మంగళవారం.. ఆ నటి పాయల్ కంటే ఎక్కువ షాక్ ఇచ్చింది
X

ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన 'మంగళవారం' మూవీ గత శుక్రవారం ప్రేక్షకులు ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. పోటీగా పెద్ద సినిమాలేవి లేకపోవడంతో మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. శని, ఆదివారాల్లోనూ డీసెంట్ వసూళ్లు అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని పాయింట్ తో అజయ్ భూపతి ఈ సినిమా తెరకెక్కించడం, పాయల్ రాజ్ పుత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేయడంతో సినిమా ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సినిమాలో తన పాత్రకి పూర్తిస్థాయిలో న్యాయం చేసింది పాయల్. నిజానికి ఇలాంటి పాత్రలు చేయాలంటే చాలా గట్స్ కావాలి. కానీ పాయల్ మాత్రం ఆ పాత్రని ఒప్పుకోవడమే కాకుండా తన పర్ఫామెన్స్ తో ప్రేక్షకుల మెప్పు పొందుతోంది.

పాయల్ తో పాటు సినిమాలో మరికొందరు యాక్టర్స్ మంచి నటన కనబరిచారు. వాళ్లలో బాగా హైలెట్ అయింది మాత్రం జమిందార్ భార్య పాత్రలో నటించిన అమ్మాయి. చూడ్డానికి చాలా అందంగా కనిపించే ఈ అమ్మాయి చివర్లో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చే పాత్రలో నటించి ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది. సినిమా చూసిన చాలా మంది ఈ అమ్మాయి ఎవరని సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు. దీంతో ఆ అమ్మాయికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ బయటికి వచ్చాయి.

ఆమె పేరు దివ్య పిళ్లై. ఆమె ఓ మలయాళ నటి. ఇప్పటికే మలయాళంలో చాలా సినిమాల్లో నటించింది. రీసెంట్ టైంలో ఓటీటీలో సూపర్ హిట్ గా నిలిచిన టోవినో థామస్ 'కలా' మూవీలో హీరో భార్యగా నటించింది. మలయాళం తో పాటు తమిళంలోనూ ఒక రెండు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఇక తెలుగులో మంగళవారం కంటే ముందు నవీన్ చంద్ర నటించిన 'తగ్గేదే'లే మూవీలో హీరోయిన్ గా నటించింది.

ఆ సినిమా ఆడియన్స్ కి చేరువ కాలేదు. కానీ అజయ్ భూపతి ఆమె టాలెంట్ గుర్తించి మంగళవారం మూవీలో అవకాశం ఇచ్చాడు. సినిమా ఆరంభంలో మామూలుగా అనిపించే ఈమె పాత్ర చివర్లో మాత్రం బాగా హైలైట్ అయింది. ఆ పాత్రలో దివ్య తన పర్ఫామెన్స్ తో ప్రేక్షకుల దృష్టిలో పడింది. రాబోయే రోజుల్లో ఈమెకి టాలీవుడ్ లో మంచి పాత్రలు దక్కే అవకాశం ఉందని మిస్సందేహంగా చెప్పొచ్చు.