Begin typing your search above and press return to search.

మంగళవారం సెంటిమెంట్‌ తో 'మంగళవారం' స్ట్రీమింగ్‌!

పాయల్‌ రాజ్ పూత్‌ ప్రధాన పాత్రలో అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన మంగళవారం సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

By:  Tupaki Desk   |   12 Dec 2023 10:02 AM GMT
మంగళవారం సెంటిమెంట్‌ తో మంగళవారం స్ట్రీమింగ్‌!
X

పాయల్‌ రాజ్ పూత్‌ ప్రధాన పాత్రలో అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన మంగళవారం సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. వీరి కాంబోలో గతంలో వచ్చిన ఆర్‌ఎక్స్ 100 సినిమా ను మించి మంగళవారం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

నవంబర్ 17న మంగళవారం సినిమా థియేట్రికల్‌ రిలీజ్ అయిన విషయం తెల్సిందే. నాలుగు వారాల తర్వాత అంటే డిసెంబర్‌ 15న ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ మంగళవారం సినిమా ను మంగళవారం సెంటిమెంట్‌ తో స్ట్రీమింగ్‌ చేయాలనే ఉద్దేశ్యంతో కాస్త ఆలస్యంగా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

డిసెంబర్‌ 26వ తారీకున మంగళవారం సందర్భంగా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ వారు ప్లాన్‌ చేస్తున్నాట. ఆహా మరియు డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ వారు ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు తీవ్రంగా పోటీ పడి చివరకు డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్ చేతికి స్ట్రీమింగ్‌ హక్కులు దక్కినట్లుగా సమాచారం అందుతోంది.

మంగళవారం సినిమాలో పాయల్‌ రాజ్‌ పూత్‌ నటనకి మంచి మార్కులు పడ్డాయి. అంతే కాకుండా దర్శకుడు ఇలాంటి ఒక కథను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో రూపొందించేందుకు ముందుకు రావడం, నిర్మాతలు కూడా ధైర్యంగా ఈ సినిమా నిర్మాణానికి ఖర్చు చేయడం అభినందనీయం అంటూ రివ్యూవర్స్ విడుదల సమయంలో అభిప్రాయం వ్యక్తం చేశారు.

విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న మంగళవారం సినిమా మరో మంగళవారం నాడు డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్‌ పై సందడికి సిద్ధం అవుతోంది. త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.