Begin typing your search above and press return to search.

'మంగళవారం' కి కొత్త వేదిక సిద్ధం!

ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో సక్సెస్‌ ను దక్కించుకున్న అజయ్‌ భూపతి మరియు పాయల్ రాజ్ పూత్‌ ల కాంబో తాజాగా మంగళవారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   9 Dec 2023 9:58 AM GMT
మంగళవారం కి కొత్త వేదిక సిద్ధం!
X

ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో సక్సెస్‌ ను దక్కించుకున్న అజయ్‌ భూపతి మరియు పాయల్ రాజ్ పూత్‌ ల కాంబో తాజాగా మంగళవారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆర్‌ఎక్స్ 100 సినిమాకి మించి ఉందంటూ మంగళవారం సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ రెస్సాన్స్ దక్కింది.

బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు దక్కించుకున్న మంగళవారం సినిమాను ఇంకా చూడని వారు ఓటీటీ ద్వారా చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు మంగళవారంకు ఓటీటీ వేదిక సిద్ధం అయింది. థియేటర్ల ద్వారా మెప్పించిన మంగళవారం కి కొత్త వేదికగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ ఓటీటీ నిలువబోతుంది.

భారీ ఫ్యాన్సీ రేటుకు మంగళవారం స్ట్రీమింగ్‌ హక్కులను డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ వారు కొనుగోలు చేశారంటూ సమాచారం అందుతోంది. సినిమా విడుదల అయ్యి దాదాపు నాలుగు వారాలు అవ్వబోతుంది. కనుక ఏ క్షణంలో అయినా డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ప్రముఖ ఓటీటీ లు ఈ సినిమా స్ట్రీమింగ్‌ రైట్స్ కోసం పోటీ పడ్డాయని తెలుస్తోంది. తెలుగు ఓటీటీ ఆహా వారు కూడా ఈ సినిమని కొనుగోలు చేయాలని తీవ్రంగా ప్రయత్నించారట. కానీ డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ వారు భారీ రేటు ను కోడ్‌ చేయడం వల్ల వారికే ఓటీటీ రైట్స్ ను నిర్మాతలు కట్టబెట్టారు అంటున్నారు.

థియేట్రికల్ రిలీజ్ తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న మంగళవారం సినిమా కి ఓటీటీ ప్రేక్షకులు కూడా కచ్చితంగా బ్రహ్మరథం పట్టే అవకాశాలు ఉన్నాయని బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సినిమా హిట్‌ తో పాయల్‌ కి భారీ చిత్రాల్లో ఆఫర్లు వస్తున్నట్లుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు.