Begin typing your search above and press return to search.

భయపెట్టడానికి సిద్ధమైన మంగళవారం..!

ఆర్ఎక్స్ 100తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి. ఈ మూవీ తర్వాత మహాసముద్రం మూవీతో వచ్చాడు

By:  Tupaki Desk   |   26 Sep 2023 6:01 AM GMT
భయపెట్టడానికి సిద్ధమైన మంగళవారం..!
X

ఆర్ఎక్స్ 100తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి. ఈ మూవీ తర్వాత మహాసముద్రం మూవీతో వచ్చాడు. అయితే, ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో, ఈసారి కచ్చితంగా హిట్ కొట్టాలని ఆయన ఫిక్స్ అయ్యారు.తన తొలి సినిమా హిట్ కావడానికి కారణమైన పాయల్ రాజ్ పూత్ తో కలిసి మంగళవారం మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు.


కాగా, తాజాగా ఈ మంగళవారం సినిమా విడుదల తేదీని తాజాగా ప్రకటించారు. నవంబర్ 17వ తేదీన ఈ మూవీని విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళం, మళయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇక, ఈ మూవీని దర్శకుడు అజయ్ భూపతి తన రెండు సినిమాలకు భిన్నంగా తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే ఈ మూవీ టీజర్ విడుదల చేయగా, విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత గణగణ మోగాలిరా అనే పాట కూడా విడుదల చేశారు. ఈ పాట కూడా బాగానే క్లిక్ అయ్యింది. ఇక, కొంతకాలం క్రితం ఈ మూవీ ఓవర్ సీస్ రైట్స్ కూడా మంచి డీల్ కుదిరింది. సదరన్ స్టార్ ఇంటర్నేషనల్ ఈ మూవీని రూ.1.53కోట్లకు కొనుగోలు చేసిందట.

ఇక, ఈ మూవీపై డైరెక్టర్ అజయ్ భూపతితో పాటు, హీరోయిన్ పాయల్ ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ఆర్ఎక్స్ 100 తర్వాత పాయల్ చాలా సినిమాలు చేసింది. కానీ, ఆ రేంజ్ లో హిట్ మళ్లీ ఆమెకు దక్కలేదు. అయితే, మంగళవారంతో మరోసారి ఆమె కెరీర్ లో అదిరిపోయే హిట్ అందుకునే అవకాశం ఉందని చిత్ర బృందం భావిస్తోంది. ఈ సినిమాకి అజనీష్ లోక్ సంగీతం అందిస్తున్నారు. గతంలో ఆయన కాంతార, వీరూపాక్ష సినిమాలకు సంగీతం అందించారు.

ఈ సినిమాని, 90వ దశకంలో గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు చూడని డిఫరెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ అని తెలుస్తోంది. థియేటర్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులకు గుర్తుండేలా పాయల్‌ క్యారెక్టరైజేషన్‌ ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది.