Begin typing your search above and press return to search.

'మంగళవారం' కి అదిరిపోయే ఓవర్సీస్ డీల్..!

ఆర్ఎక్స్ 100 సినిమా గురించి స్పెషల్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు.

By:  Tupaki Desk   |   4 Sept 2023 11:29 AM IST
మంగళవారం కి అదిరిపోయే ఓవర్సీస్ డీల్..!
X

ఆర్ఎక్స్ 100 సినిమా గురించి స్పెషల్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఈ మూవీలో ఓ ట్రెండ్ సెట్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా యూత్ కి బాగ్ కనెక్ట్ అయ్యింది. అంతేకాదు, ఈ సినిమాతో అజయ్ భూపతి లాంటి డైరెక్టర్ టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. ఈ మూవీలో కొత్త రకం ప్రేమ కథను పరిచయం చేశారు. ఈ కథ ప్రేమికులకు విపరీతంగా నచ్చేసింది. ఆ సినిమాలో హీరో కార్తికేయ, హీరోయిన్ పాయల్ రాజ్ పూత్ లకు మంచి పేరు వచ్చింది.

ఈ సినిమా తర్వాత ఆయన మహా సముద్రం అనే సినిమాని తెరకెక్కించారు. అయితే, ఆ మూవీ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. దీంతో, చాలా కాలం గ్యాప్ తీసుకొని మంగళవారం సినిమా చేస్తున్నారు. తనకు మొదటి సినిమాతో హిట్ తెచ్చిపెట్టిన పాయల్ ని ఈ సినిమాలో కూడా సెలక్ట్ చేశారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కథను కూడా చాలా భిన్నంగా చూపించాలని డైరెక్టర్ డిసైడ్ అయ్యారు.

ఇప్పటికే ఈ మూవీ టీజర్ విడుదల చేయగా, విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత గణగణ మోగాలిరా అనే పాట కూడా విడుదల చేశారు. ఈ పాట కూడా బాగానే క్లిక్ అయ్యింది. కాగా, తాజాగా ఈ మూవీ గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది. దాని ప్రకారం ఈ మూవీ ఓవర్సీస్ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. అది కూడా చాలా మంచి ధరతో డీల్ కుదిరినట్లు సమాచారం. సదరన్ స్టార్ ఇంటర్నేషనల్ ఈ మూవీని రూ.1.53కోట్లకు కొనుగోలు చేసిందట. ఈ ధర పలకడం పట్ల మూవీ మేకర్స్ చాలా సంతోషంగా ఉన్నారు.


ఇక, ఈ సినిమా నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్ఎక్స్ 100 తర్వాత పాయల్ చాలా సినిమాలు చేసింది. కానీ, ఆ రేంజ్ లో హిట్ మళ్లీ ఆమెకు దక్కలేదు. అయితే, మంగళవారంతో మరోసారి ఆమె కెరీర్ లో అదిరిపోయే హిట్ అందుకునే అవకాశం ఉందని చిత్ర బృందం భావిస్తోంది. ఇక, డైరెక్టర్ అజయ్ భూపతి కూడా ఈ మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు.ఈ సినిమాకి అజనీష్ లోక్ సంగీతం అందిస్తున్నారు. గతంలో ఆయన కాంతార, వీరూపాక్ష సినిమాలకు సంగీతం అందించారు.

ఈ సినిమాని, 90వ దశకంలో గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు చూడని డిఫరెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ అని తెలుస్తోంది. థియేటర్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులకు గుర్తుండేలా పాయల్‌ క్యారెక్టరైజేషన్‌ ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఈ మూవీని విడుదల చేస్తున్నారు. మరి ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.