స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!
టాలీవుడ్‌లో ‘మండే సూర్యుడు’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ రిజిస్టర్ చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ టైటిల్ మాస్ యాక్షన్ సినిమాకు సరిపోతుందని, రవితేజ, సూర్య, విక్రమ్ వంటి హీరోలకు యాప్ట్ అవుతుందని చర్చ నడుస్తోంది. అయితే ఏ హీరో కోసం ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేశారన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
By: Srikanth Kontham | 11 Nov 2026 1:00 PM ISTటాలీవుడ్‌లో ఏ చిన్న క్రేజీ అప్‌డేట్ వచ్చినా ? అది సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. ముఖ్యం గా స్టార్ హీరోల ప్రాజెక్టులకు సంబంధించిన టైటిల్స్ విషయంలో ఫిల్మ్ నగర్‌లో ఆసక్తికర చర్చ నడస్తుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఫిల్మ్ చాంబర్‌లో `మండే సూర్యుడు` అనే శక్తివంతమైన టైటిల్‌ను రిజిస్టర్ చేయించినట్లు టాక్ వినిపిస్తోంది. టైటిల్ వినగానే? వైలెంట్ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా మాస్, యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలకు పవర్‌ఫుల్ ఎలివేషన్ ఇచ్చే టైటిల్స్ పెట్టడం మేకర్స్‌కు అలవాటే.
`మండే సూర్యుడు` అనే పేరులోనే తీవ్రమైన వేడి, హీరోయిజం, రౌద్రం వంటి అంశాలు ప్రతిబింబిస్తున్నాయి. దీంతో ఈ కథ ఏ స్థాయి అగ్రెసివ్ టోన్‌తో ఉంటుందోనని అభిమానులు లెక్కలు వేయడం ప్రారంభించారు. ఈ టైటిల్ వెనుక ఉన్న కథాంశం పవర్ ఫుల్ రివేంజ్ డ్రామా .. ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అయి ఉంటుం దన్నది మరో వెర్షన్. అయితే ఈ టైటిల్ ఏ స్టార్ హీరో కోసం లాక్ చేసారు? అన్నది సస్పెన్స్. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోలు ..మాస్ అప్పీల్ ఉన్న యంగ్ స్టార్స్ ఎవరి ప్రాజెక్ట్‌కైనా సరిగ్గా సరిపోతుంది.
ముఖ్యంగా కమర్షియల్ ఇమేజ్ ఉన్న స్టార్ హీరోకి పర్పెక్ట్ గా యాప్ట్ అయ్యే టైటిల్ ఇది. ఈ నేపథ్యంలోనే నిర్మాణ సంస్థ టైటిల్ ను ముందుగానే బ్లాక్ చేసి ఉండొచ్చని తెలుస్తోంది. అయితే ఈ టైటిల్ లో ఏ హీరో సినిమాచేసినా? అది కచ్చితంగా రీజనల్ మార్కెట్ కే సెట్ అవుతుంది. అందులో తెలుగు హీరో నటించినా? తమిళ హీరో నటించినా? ఆయా భాషల్లో తిరుగుండదు. కానీ ఇదే టైటిల్ తో పాన్ ఇండియా మార్కెట్ లో వర్కౌట్ అవ్వడం కష్టం.
పాన్ ఇండియా సినిమా అంటే? కథతో పాటు టైటిల్ కూడా యూనిక్ గా అన్నీ మార్కెట్లకు కనెక్ట్ అవ్వాలి.
`మండే సూర్యుడు` విషయంలో ఆ ఛాన్స్ లేదు కాబట్టి రీజనల్ మార్కెట్ లో పేరున్న మాస్ హీరోకి పక్కాగా సెట్ అవుతుంది. తమిళ్ లో సూర్య, విక్రమ్ లాంటి స్టార్లు లేదా? తెలుగులో రవితేజ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న స్టార్ కు సెట్ అవుతుంది. మరి ఈ ఛాన్స్ సదరు నిర్మాణ సంస్థ ఏ దర్శకుడికి అప్పగిస్తుంది? అందులో హీరో ఎవరు? అన్నది తేలాలి.
