మందాకినీపై కేసు వేయాలట.. నటి డిమాండ్
ఆకర్షణీయమైన గాజు కళ్లు.. అద్భుత నటప్రతిభతో మాయాజాలం సృష్టించిన నాటిమేటి నటి మందాకిని.
By: Tupaki Desk | 6 May 2025 4:02 AMఆకర్షణీయమైన గాజు కళ్లు.. అద్భుత నటప్రతిభతో మాయాజాలం సృష్టించిన నాటిమేటి నటి మందాకిని. 90లలో హిందీ చిత్రసీమతో పాటు తెలుగు, తమిళ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. సూపర్ స్టార్ కృష్ణ నటించిన `సింహాసనం` చిత్రంలో మందాకిని నటన, గ్లామర్ షోని తెలుగు ప్రజలు అంత తేలిగ్గా మర్చిపోలేరు. గ్లామర్ ఎలివేషన్ కి హద్దులు నిర్ధేశించిన రోజుల్లోనే మందాకిని అందాల ఆరబోతతో యువతరాన్ని వెర్రెత్తించింది.
అయితే ఇప్పుడు ఈ నటిని అరెస్ట్ చేయాలని కోరుతోంది మోడ్రన్ డే నటి గెహనా వశిష్ఠ్. ఇటీవల `హౌస్ అరెస్ట్` ఓటీటీ షోలో అసభ్యత కారణంగా మహిళా కమీషన్ ఆగ్రహానికి గురైన తన టీమ్ కి మద్ధతుగా నిలుస్తూ గెహనా వశిష్ఠ్ చేసిన కామెంట్లు ఇప్పుడు చర్చగా మారాయి. హౌస్ అరెస్ట్ షో అసభ్యత, అశ్లీల భంగిమల కారణంగా.. హోస్ట్ అజాజ్ ఖాన్, ఉలు యాప్ సీఈవోలకు మహిళా కమీషన్ సమన్లు పంపడంతో ఇది చర్చగా మారింది.
ఈ సందర్భంగా హౌస్ అరెస్ట్ నటి గెహనా వశిష్ఠ్ మాట్లాడుతూ... సినిమాల్లో రెచ్చిపోయి కనిపించే ప్రియాంక చోప్రా, రాధికా ఆప్టే, రణ్ వీర్ సింగ్ లపైనా కేసులు నమోదు చేయాలని, హద్దులు చెరిపేసిన శృం*గార సన్నివేశాల్లో నటించిన నాటి మేటి నటి మందాకినిపైనా ఆరోపణలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. వారంతా గ్లామర్ షో చేసారు. కానీ వారిపై ఎందుకు మీరంతా ఆరోపించలేదు? అని కూడా నిలదీసారు గెహనా. లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్న వారిని కూడా సమానంగా ట్రీట్ చేయాలి కదా? అని అడిగారు. నీలిచిత్రాలు చూసేవారిపై ఎందుకు చర్యలు తీసుకోరు? డిజిటల్ రంగంలో సెన్సార్ షిప్ ఎందుకు లేదు? అని కూడా ప్రశ్నించారు. హౌస్ అరెస్ట్ ప్రచార వీడియోలో అసభ్యత కారణంగా ఈ వివాదం మొదలైంది. ఈ వివాదంపై నటి గెహనా వశిష్ఠ్ తనదైన శైలిలో స్పందించింది.
మేటి కథానాయిక మందాకిని 1980లలో పాపులర్ నటి. దశాబ్ధం పాటు అగ్ర కథానాయికగా కొనసాగింది. కానీ వ్యక్తిగత జీవితంలో గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీంతో ముడిపెడుతూ కథనాలు రావడంతో కెరీర్ నాశనం అయింది. 2006లో తన 82 వయసులో మందాకిని మరణించారు.