Begin typing your search above and press return to search.

పురుషాధిక్య‌త‌ను ప్ర‌శ్నించిన మందాకిని!

సూప‌ర్ స్టార్ కృష్ణ న‌టించిన క్లాసిక్ మూవీ `సింహాస‌నం`లో న‌టించింది మందాకిని. తొలి చిత్రంతోనే తెలుగు ప్ర‌జ‌ల్లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ సంపాదించుకుంది.

By:  Tupaki Desk   |   19 July 2025 10:00 AM IST
పురుషాధిక్య‌త‌ను ప్ర‌శ్నించిన మందాకిని!
X

సూప‌ర్ స్టార్ కృష్ణ న‌టించిన క్లాసిక్ మూవీ `సింహాస‌నం`లో న‌టించింది మందాకిని. తొలి చిత్రంతోనే తెలుగు ప్ర‌జ‌ల్లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంద‌మైన‌ గాజు క‌ళ్లు, క్యూట్ లుక్స్‌తో మాయ చేసిన ఈ బ్యూటీ..బాలీవుడ్ లో అప్ప‌టికే పెద్ద స్టార్ గా ఎదుగుతోంది. `రామ్ తేరి గంగా మైలీ` స్టార్ గా మందాకినికి గొప్ప గుర్తింపు ఉంది. చాలా కాలం స్టార్ గా కొన‌సాగిన మందాకిని ఆ త‌ర్వాత ప‌రిశ్ర‌మ‌కు దూర‌మైంది. దాదాపు 20 సంవత్సరాల తర్వాత మందాకిని సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోంద‌నే ప్ర‌చారం ఉంది.

1985లో విడుదలైన `రామ్ తేరి గంగా మైలీ` చిత్రంలో గంగా సింగ్ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మందాకిని .. 1996లో సినీప‌రిశ్ర‌మ‌ను విడిచిపెట్టింది. చాలా కాలం వ్య‌క్తిగ‌త జీవితంపై దృష్టి సారించింది. అయితే ఇటీవ‌ల‌ మందాకిని ఓ మ్యూజిక్ ఆల్బమ్ లో న‌టిస్తోంద‌ని కూడా ప్ర‌చారమైంది. త‌ల్లి పాత్ర‌లో న‌టించే వీలుంద‌ని కూడా క‌థ‌నాలొచ్చాయి.

అయితే మందాకిని త్రోబ్యాక్ ఇంట‌ర్వ్యూలో పురుషాధిక్య‌త గురించి, అధిక పారితోషికాల గురించి మాట్లాడింది. అప్ప‌ట్లో క‌థానాయిక‌ల‌కు 2ల‌క్ష‌ల పారితోషికం అంటే చాలా ఎక్కువ‌. తాను అంత పెద్ద మొత్తం అందుకునేది. కానీ మేల్ స్టార్స్ పారితోషికాల‌తో పోలిస్తే ఇది చాలా త‌క్కువ‌. అయినా అప్ప‌ట్లో ఒక సినిమాకి 1 ల‌క్ష‌కు మాట్లాడుకుంటే, 75 వేల‌కే వేరొక హీరోయిన్ న‌టించేస్తోంద‌ని నిర్మాత త‌న‌ను మూవీ నుంచి తొల‌గించాడ‌ని వెల్ల‌డించింది. ఏదైనా సినిమాకి అంగీక‌రిస్తే, రెండు మూడు రోజుల్లో వేరే క‌థానాయిక‌తో ఆ సినిమాని ప్ర‌క‌టించ‌డం చూసాను. ప్ర‌తిదీ అనుభ‌వ పూర్వ‌కంగా చూసిన‌వేన‌ని మందాకిని అన్నారు.