Begin typing your search above and press return to search.

భార్య‌కు మంచు విష్ణు స‌ర్‌ప్రైజ్ ఆ లెవ‌ల్లో!

హెలీకాఫ్ట‌ర్ విహారానికి ప్లాన్ చేసిన విష్ణు న్యూజిలాండ్ లోని అద్భుత‌మైన ఎగ్జోటిక్ లొకేష‌న్ల‌ను చూపిస్తూ త‌న భార్య‌ను ఉత్సాహ‌ప‌రిచారు.

By:  Tupaki Desk   |   1 March 2024 3:53 PM GMT
భార్య‌కు మంచు విష్ణు స‌ర్‌ప్రైజ్ ఆ లెవ‌ల్లో!
X

కెరీర్ ప‌రంగా ఎంత బిజీ షెడ్యూల్స్ ఉన్నా కుటుంబం కోసం స‌మ‌యం కేటాయించ‌డం చాలా ముఖ్యం. టాలీవుడ్ హీరోలు ఇలాంటి విష‌యాల్లో చాలా కేరింగ్ గా ఉంటారు. ఎన్ని షెడ్యూల్స్ ఉన్నా కానీ.. భార్య పిల్ల‌ల‌తో బ‌ర్త్ డేలు, పెళ్లిరోజు వేడుక‌ల‌ను జ‌రుపుకునేందుకు ఆరోజు వారి కోస స‌మ‌యం కేటాయించేందుకు వెన‌కాడ‌రు.

ఇప్పుడు మంచు విష్ణు త‌న భార్య విరోనికాకు అద్భుత‌మైన స‌ర్ ప్రైజ్ ని ఇచ్చారు. ఓ వైపు షూటింగ్ బిజీలో ఉన్నా కానీ, నేడు 15వ వివాహ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా విష్ణు త‌న భార్య‌కు బిగ్ స‌ర్ ప్రైజ్ నిచ్చారు. హెలీకాఫ్ట‌ర్ విహారానికి ప్లాన్ చేసిన విష్ణు న్యూజిలాండ్ లోని అద్భుత‌మైన ఎగ్జోటిక్ లొకేష‌న్ల‌ను చూపిస్తూ త‌న భార్య‌ను ఉత్సాహ‌ప‌రిచారు. చాప‌ర్ నుంచి న్యూజిలాండ్ లోని అంద‌మైన‌ ల్యాండ్ స్కేప్ దృశ్యాల‌ను వీక్షిస్తూ వెరోనికా ఎంతో మురిసిపోతున్న వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారింది.

ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న తెలుగు ఫాంటసీ డ్రామా 'కన్నప్ప'లో మంచు విష్ణు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం హిందువుల ఆరాధ్యదైవం శివుని భక్తుడైన కన్నప్ప జీవితాన్ని తెర‌పై ఆవిష్క‌రిస్తుంది.

ప్రస్తుతం న్యూజిలాండ్‌లోని అద్భుత లొకేష‌న్ల‌లో చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. మంచు విష్ణు, మోహన్ బాబు స‌హా చిత్ర‌బృందం ఆన్ లొకేష‌న్ పనిలో మునిగిపోయిన వీడియో ఇంత‌కుముందు విడుద‌లైంది. ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, మధు , నయనతార, శరత్‌కుమార్, బ్రహ్మానందం, జోసితా అనోలా రోడ్రిగ్స్ కీలక పాత్రల్లో నటించారు. నటసింహ బాలకృష్ణ కూడా పవర్‌ఫుల్ క్యామియోలో కనిపిస్తాడని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప్రతిభావంతులైన స్టీఫెన్ దేవస్సీ , మణి శర్మ ద్వయం అందిస్తున్న‌ సంగీతం ప్ర‌ధాన అస్సెట్ కానుంది.