Begin typing your search above and press return to search.

భక్త కన్నప్ప.. రంగంలోకి మరో వారసుడు

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ భక్తకన్నప్ప సినిమా షూటింగ్ దశలోనే హాట్ టాపిక్ గా మారుతుంది

By:  Tupaki Desk   |   5 Jan 2024 9:35 AM GMT
భక్త కన్నప్ప.. రంగంలోకి మరో వారసుడు
X

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ భక్తకన్నప్ప సినిమా షూటింగ్ దశలోనే హాట్ టాపిక్ గా మారుతుంది. ఈ సినిమాలో కంటెంట్ ఎలా ఉండబోతుంది అనే విషయం కన్నా కూడా కాస్టింగ్ ఎక్కువగా జనాలను అట్రాక్ట్ చేస్తుంది. ఊహించని విధంగా ఈ ప్రాజెక్టు కోసం ప్రముఖ నటీనటులో నటించాలని ఆసక్తి చూపిస్తూ ఉండడంతో ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందా అని అందరిలో ఒక ఆసక్తి అయితే కలుగుతుంది.


మంచు విష్ణు బడ్జెట్ విషయంలో అయితే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఈ సినిమాను తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. మహాభారతం ఫేమ్ ముకేశ్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక సినిమాలో మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ప్రత్యేకమైన పాత్రలలో అలరించబోతున్నారు.

ఇక ఈ ప్రాజెక్టులో పంచు విష్ణు తండ్రి మంచు మోహన్ బాబు కూడా స్పెషల్ క్యారెక్టర్ తో కనిపించబోతున్నారు. అలాగే వీరితో పాటు మరో వారసుడు కూడా ఇందులో కనిపించబోతున్నట్లు మంచి విష్ణు అధికారికంగా క్లారిటీ ఇచ్చేశారు. మంచి మోహన్ బాబు మంచు విష్ణు రెండు తరాల తర్వాత వీరి మూడవ తరం నటుడు అవ్రామ్ కూడా ఇందులో నటిస్తున్నట్లుగా అధికారికంగా క్లారిటీ ఇచ్చారు.

దీంతో ఈ ప్రాజెక్టుపై మంచి హైప్ క్రియేట్ అవుతుంది. ఐదేళ్ల వయసులోనే మంచి విష్ణు తన కుమారుడని ఈ సినిమాతో పరిచయం చేస్తున్నాడు అంటే ప్రాజెక్టుపై ఎంతగా నమ్మకం పెట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా తన కెరీర్ లో చాలా స్పెషల్ అని తప్పకుండా ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అవుతుంది అని ధీమాగా ఉన్నట్లు విష్ణు తెలియజేశాడు.

ఇక భక్త కన్నప్ప గా కనిపించబోతున్న విష్ణు ఏమాత్రం బ్రేకులు లేకుండా సినిమాను పూర్తి చేసే విధంగా అడుగులు వేస్తున్నారు. రీసెంట్గా న్యూజిలాండ్లో ఒక కీలకమైన షెడ్యూల్ కూడా పూర్తి చేశారు. ఇక వీలైనంత త్వరగా మరికొంత షూటింగ్ ను ఫినిష్ చేసి టీజర్ ను కూడా విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. మరి ఈ సినిమాతో మంచి విష్ణు మార్కెట్ ఏ లెవెల్ కు పెరుగుతోందో చూడాలి.