Begin typing your search above and press return to search.

బ‌ర్త్ డే ట్రీట్: బ్లాక్ స్వార్డ్ విధ్వ‌సం

విల‌న్ గెట‌ప్ లో మ‌నోజ్ ఎలా ఉంటాడు? అన్న‌ది రివీల్ చేస్తూ గ్లిప్ రిలీజ్ అయింది. మ‌నోజ్ మేకోవ‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది. బ్లాక్ స్వార్డ్ న్యూ గెట‌ప్ లో మ‌నోజ్ లుక్ వావ్ అనిపిస్తుంది.

By:  Tupaki Desk   |   20 May 2024 6:46 AM GMT
బ‌ర్త్ డే ట్రీట్: బ్లాక్ స్వార్డ్ విధ్వ‌సం
X

మంచు మ‌నోజ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా సినిమా నుంచి ట్రీట్ అంది చాలా కాల‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. యాక్టివ్ గా ఉన్నంత కాలం ప్ర‌తీ బ‌ర్త్ డేకి ఏదో స‌ర్ ప్రైజ్ ఉండేది. కానీ సినిమాల‌కు గ్యాప్ ఇచ్చిన త‌ర్వాత అది వెలితిగా మారింది. మ‌ళ్లీ ఇప్పుడిప్పుడే ప‌ట్టాలు త‌ప్పిన బండిని ట్రాక్ ఎక్కిస్తున్నాడు. కొత్త ప్రాజెక్ట్ ల‌తో అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు. కంబ్యాక్ ని ఈసారిగా గ‌ట్టిగానే ప్లాన్ చేసిన‌ట్లు అత‌డి తాజా చిత్రాల్ని బ‌ట్టి చెప్పొచ్చు.

ప్ర‌స్తుతం తేజ స‌జ్జా హీరోగా కార్తిక్ ఘట్టమనేని ద‌ర్శ‌క‌త్వంలో 'మిరాయ్' అనే భారీ బడ్జెట్ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో మ‌నోజ్ విల‌న్ గా న‌టిస్తున్నాడు. షూటింగ్ ప్రారంభానికి ముందే మ‌నోజ్ విల‌న్ అనే ప్ర‌చారం గ‌ట్టిగా సాగింది. అటుపై విష‌యాన్ని ద‌ర్శ‌కుడు క‌న్ప‌మ్ చేయ‌డంతో విల‌న్ గెట‌ప్ ఎలా ఉంటుంది? అన్న ఆస‌క్తి ప్రేక్ష‌కుల్లో మొద‌లైంది. తాజాగా నేడు మ‌నోజ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా మంచు అభిమానుల‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేసాడు.

విల‌న్ గెట‌ప్ లో మ‌నోజ్ ఎలా ఉంటాడు? అన్న‌ది రివీల్ చేస్తూ గ్లిప్ రిలీజ్ అయింది. మ‌నోజ్ మేకోవ‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది. బ్లాక్ స్వార్డ్ న్యూ గెట‌ప్ లో మ‌నోజ్ లుక్ వావ్ అనిపిస్తుంది. వెనుక నుంచి దూసుకొస్తున్న‌ భారీ సైన్యం..సోలోగా చుట్టుముట్టిన ప్ర‌త్యర్దుల్ని బ్లాక్ స్వార్డ్ క‌త్తితో చేస్తోన్న విరోచిత యుద్ద స‌న్నివేశాలు పీక్స్ లో ఉన్నాయి. అతి పెద్ద ర‌క్త‌పాతాన్నే సృష్టించిన వైనం వ‌హ్ వా అనిపిస్తుంది. మ‌నోజ్ పోషిస్తుంది విల‌న్ పాత్ర అయినా హీరో లెవల్లో ఎంట్రీ అదిరిపోయింది.

న‌ల్ల‌టి దుస్తులు...లాంగ్ హెయిర్ స్టైల్.. చేతిలో బ‌ల‌మైన క‌త్తి మ‌నోజ్ ని స‌రికొత్త‌గా ప్రొజెక్ట్ చేస్తున్నాయి. మ‌నోజ్ లుక్ ట్రాన్స‌ప‌ర్మేష‌న్ షాకింగ్ గానే అనిపిస్తుంది. బ్లాక్ స్వార్డ్ అంటే ప్రపంచంలోని అత్యంత పవర్‌ఫుల్ శక్తులలో ఒకటి' గా హైలైట్ చేసారు. ఇప్పటికే ఈసినిమాకి సంబంధించి గ్లింప్స్ ఒక‌టి రిలీజ్ అయింది. దానికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తేజ స‌జ్జా క‌థ‌ల ఎంపిక‌ల ప‌ట్ల ఎంతో యూనిక్ గా ఉన్నాడంటూ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నాడు. తాజాగా మ‌నోజ్ గ్లింప్స్ రిలీజ్ నేప‌థ్యంలో తేజ కెరీర్ లో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ఖాయమంటూ పోస్టులు వైర‌ల్ అవుతున్నాయి. 2025 ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా 'మిరాయ్' విడుద‌ల‌వుతుంది.