Begin typing your search above and press return to search.

మంచు మనోజ్ ప్రెస్ మీట్ లో గొడవ.. అసలేమైంది?

మంచు మనోజ్ చాలా రోజుల తరువాత మీడియా ముందుకు వచ్చాడు. ఉస్తాద్ అనే టాక్ షో ద్వారా సరికొత్తగా రీ ఎంట్రీ ఇస్తున్న మనోజ్ ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి వివరణ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   7 Dec 2023 8:43 AM GMT
మంచు మనోజ్ ప్రెస్ మీట్ లో గొడవ.. అసలేమైంది?
X

మంచు మనోజ్ చాలా రోజుల తరువాత మీడియా ముందుకు వచ్చాడు. ఉస్తాద్ అనే టాక్ షో ద్వారా సరికొత్తగా రీ ఎంట్రీ ఇస్తున్న మనోజ్ ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో మీడియా అడిగిన ప్రశ్నలకు ఎంతో సరదాగా సమాధానాలు కూడా చెప్పాడు. అయితే ఊహించని విధంగా మధ్యలో ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నను అడుగుతుండగా అప్పుడే కాస్త గందరగోళంగా అనిపించింది.

ఇక సదరు మీడియా వ్యక్తి ప్రశ్నను అడగకుండానే కావాలని పీఆర్ఓ లు మైక్ లాక్కున్నారు అంటూ వివరణ ఇచ్చారు. అయితే అక్కడ నిజంగా జరిగింది ఏమిటి అంటే.. ఎక్కువమంది జర్నలిస్టుల రావడంతో అందరికి అవకాశం ఇవ్వాలని పీఆర్ఓలు ఆలోచించారు. ప్రతీసారి ప్రెస్ మీట్ కు 30 నుంచి 40 మందికి పైగా జర్నలిస్టులను పిలుస్తున్నారు. కానీ ప్రశ్నలు మాత్రం ఒక నలుగురైదుగురు మాత్రమే అడుగుతున్నారు అని మిగతా జర్నలిస్టుల నుంచి కొంత అసంతృప్తి అయితే ఉంది. దీంతో అందరికి ప్రశలు అడిగే అవకాశం ఇవ్వాలని పీఆర్ఓ లు అనుకున్నారు.

ఇక ఇంతలో ఒక మీడియా వ్యక్తి మనోజ్ వరుసగా 3 ప్రశ్నలు అడిగిన తరువాత మళ్ళీ వెంటనే విష్ణు తో జరిగిన గొడవ గురించి 4వ ప్రశ్నను అడిగారు. ఈ క్రమంలో పక్కన ఉన్న తోటి జర్నలిస్టులు కూడా మరొక ప్రశ్న అడగాలని ఎదురుచూస్తూ ఉండడంతో పీఆర్ఓ లు వారికి మైక్ ఇవ్వాలని సున్నితంగానే కోరారు. అయితే ఆ ప్రశ్న ఆడిగేటప్పుడే కావాలని మైక్ లాక్కుంటున్నారు అని కొంత అసంతృప్తి వ్యక్తం చేయగా అప్పటికి మనోజ్ ఆ గొడవ గురించి ఒక సమాధానం అయితే ఇచ్చారు. నిజానికి అక్కడ ప్రశ్నకు మైక్ లాక్కోవడానికి సంబంధం అయితే లేదు. మిగతా వారు కూడా చాలా సేపటి నుంచి ప్రశ్నలు అడగాలని ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకే మైక్ మరొకరికి ఇవ్వాలి అనుకోవడంతో విషయం మరోలా హైలెట్ అయ్యింది.

ఇక ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మనోజ్ ఆ విషయం గురించి తన అన్ననే అడగాలని అన్నట్లుగా కూల్ గా ఆన్సర్ ఇచ్చి అక్కడితో క్లోజ్ చేశారు. ఇక తక్కువ సమయం ఉంటుంది కాబట్టి అందరూ జర్నలిస్టులు ప్రశ్నలు అడగాలని అనుకున్నారు. దాంతో పీఆర్ఓ లు కూడా అందరికి సహకరించాలి అనుకున్న క్రమంలో అక్కడ కాస్త గందరగోళంగా అనిపించింది కానీ అదేమి అంత పెద్ద సీరియస్ మ్యాటర్ కాదు. ఇక మనోజ్ అయితే వీలైనంత వరకు అందరూ అడిగిన ప్రశ్నలకు చాలా కూల్ గా సమాధానాలు ఇచ్చారు.

ఇక ఉస్తాద్ టాక్ షో ద్వారా సెలబ్రెటీలతో గేమ్స్ ఆడించబోతున్న మనోజ్ అందులో వచ్చే డబ్బును ఫ్యాన్స్ కోసం ఇవ్వబోతున్నట్లు చెప్పాడు. ఫ్యాన్స్ కోసం హీరోలు అనే కాన్సెప్ట్ తో ఈ రియాల్టీ షో వసగున్నట్లు చెప్పారు. ఇక ఇప్పటికే నాని, రవితేజ, అడివి శేష్ లాంటి స్టార్స్ కూడా ఈ టాక్ షోలో కనిపించబొతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ఓటీటీ ఎంట్రీ తో మనోజ్ ఏ స్థాయిలో క్రేజ్ అందుకుంటాడో చూడాలి.