Begin typing your search above and press return to search.

మంచు వారి కన్నప్పలో అతనికి ప్లేస్ ఉందా లేదా..?

వీరితో పాటుగా మలయాళ స్టార్ మోహన్ లాల్.. కన్నడ శివన్న కూడా మరో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారని టాక్.

By:  Tupaki Desk   |   13 March 2024 4:36 AM GMT
మంచు వారి కన్నప్పలో అతనికి ప్లేస్ ఉందా లేదా..?
X

మంచు విష్ణు లీడ్ రోల్ లో నటిస్తూ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా కన్నప్ప. ఈ సినిమాను మచు విష్ణు స్వీయ నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ స్పెషల్ రోల్ లో నటిస్తాడని తెలిసిందే. ప్రభాస్ ఉంటున్నాడని తెలిసి కన్నప్ప మీద అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాలో మంచు విష్ణుతో పాటుగా ప్రభాస్ ఆల్రెడీ ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తుండగా మోహన్ బాబు కూడా మరో సర్ ప్రైజింగ్ రోల్ లో కనిపిస్తారని తెలుస్తుంది.


వీరితో పాటుగా మలయాళ స్టార్ మోహన్ లాల్.. కన్నడ శివన్న కూడా మరో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారని టాక్. అంతా బాగానే ఉంది కానీ మంచు వారి కన్నప్పలో మంచు మనోజ్ ఉంటున్నాడా లేదా అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. కొద్దిపాటి కెరీర్ గ్యాప్ తర్వాత మంచు మనోజ్ మళ్లీ తిరిగి వరుస సినిమాలు చేయాలని చూస్తున్నాడు. త్వరలోనే తన కొత్త సినిమా మొదలు కాబోతుందని తెలుస్తుంది.

ఈ టైం లో మంచు ఫ్యామిలీ కలిసి చేస్తున్న కన్నప్పలో మంచు మనోజ్ కూడా ఉంటే ఇదొక మంచు వారి మనం లాంటి ప్రాజెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. అయితే ఆల్రెడీ మంచు ఫ్యామిలీ హీరోలంతా కలిసి పాండవులు పాండవులు తుమ్మెద సినిమా చేశారు. దాదాపు 10 ఏళ్ల క్రితం వచ్చిన ఆ సినిమా మంచు ఫ్యాన్స్ ని అలరించింది. కన్నప్పతో మంచు విష్ణు చాలా పెద్ద టార్గెట్ పెట్టుకున్నాడు.

మంచు ఫ్యామిలీ కలిసి చేస్తున్న కన్నప్పలో మనోజ్ కి అవకాశం ఉందా లేదా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. మంచు విష్ణు, మనోజ్ ఇదివరకు ఉన్నంత క్లోజ్ గా ఉండట్లేదు అన్నది ఇన్నర్ టాక్. మనోజ్ రెండో పెళ్లి విషయంపై వారి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయని చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా కన్నప్పలో మంచు మనోజ్ కూడా ఉంటే సినిమాకు ఎంతో కొంత ప్లస్ అవుతుందని అంటున్నారు ఆడియన్స్. మంచు మనోజ్ కి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. వారు కూడా మనోజ్ కన్నప్పలో నటిస్తే బాగుంటుందని కోరుతున్నారు. కన్నప్పలో మంచు వారి చిన్నబ్బాయి ఉంటున్నాడా లేదా అన్నది త్వరలో క్లారిటీ వస్తుంది.