Begin typing your search above and press return to search.

టాక్ షో హోస్ట్ గా మంచు వార‌సుడు!

ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ కోసం ఓ టాక్ షోని హోస్ట్ చేస్తున్న‌ట్లు తెలిసింది

By:  Tupaki Desk   |   4 Aug 2023 8:40 AM GMT
టాక్ షో హోస్ట్ గా మంచు వార‌సుడు!
X

రాకింగ్ స్టార్ మంచు మ‌నోజ్ మ‌ళ్లీ యాక్టివ్ అయిన సంగ‌తి తెలిసిందే. కెరీర్ లో వృత్తి..వ్య‌క్తిగ‌త కార‌ణాలు గా కొంత గ్యాప్ తీసుకున్న‌ప్ప‌టికీ మ‌ళ్లీ రెట్టించిన ఉత్సాహంతో ముందుకొస్తున్నారు. ఇటీవ‌లే భూమా మౌనికా రెడ్డిని రెండ‌వ వివాహం చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ని మొద‌లు పెట్టాడు. ఇదే స‌మ‌యంలో కొత్త సినిమాల లైన‌ప్ ని రివీల్ చేసాడు. 'అహం బ్రహ్మాస్మి'..'వాట్ ది ఫిష్' లాంటి సినిమాల్లో న‌టిస్తున్నట్లు తెలిపాడు.

అలాగే మరో సినిమా పైప్‌లైన్‌లో ఉన్న‌ట్లు రివీల్ చేసాడు. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌నోజ్ మ‌రో ఇంట్రెస్టింగ్ స‌ర్ ప్రైజ్ ఇచ్చాడు. ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ కోసం ఓ టాక్ షోని హోస్ట్ చేస్తున్న‌ట్లు తెలిసింది. ఈ ప్రోగ్రామ్ ని ప్రొడక్షన్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. దీనికి సంబంధించిన షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. మ‌నోజ్ షోకి రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇంత‌వ‌ర‌కూ మ‌నోజ్ బుల్లి తెర‌పై ఎంట్రీ ఇచ్చింది లేదు. చేసినంత‌కాలం సినిమాలు చేసి గ్యాప్ తీసుకున్నాడు.

ఆ త‌ర్వాత కుటుంబ జీవితం..క‌ల‌త‌ల‌తో కొంత డిస్ట‌బెన్స్ కి గుర‌య్యాడు. ఈ క్ర‌మంలో మీడియాకి పెద్ద‌గా క‌నిపించ లేదు. రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్లు? ర‌క‌ర‌కాల వ్యాపారాలు చేస్తున్న‌ట్లు మీడియాలో వార్త‌లొచ్చాయి. అవేమి కాదు..మ‌ళ్లీ సినిమాల్లోకే వ‌స్తున్న‌ట్లు మ‌నోజ్ తేల్చి చెప్పేసాడు. అయితే న‌టుడిగా నిల‌దొక్కు కుండానే ఓ ఛాన‌ల్ లో ప్రోగ్రామ్ చేయ‌డం అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

మ‌నోజ్ ఇప్పుడు రెండు ర‌కాల జ‌ర్నీలు చేయాల్సి ఉంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే...టీవీ ప్రోగ్రామ్ ల‌కు టైమ్ కేటాయించాలి. వాటిని దిగ్విజ‌యంగా ముందుకు న‌డిపించాలి. ప్ర‌స్తుతం ఉన్న పోటీని దృష్టిలో పెట్టుకునే మ‌నోజ్ ఇలా రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం మొద‌లు పెట్టిన‌ట్లు తెలుస్తోంది.

హీరోలంతా సినిమాలు చేస్తూనే ఓటీటీలోనూ దూసుకుపోతున్నారు. నిర్మాణ రంగంలోనూ రాణిస్తున్నారు. బిజినెస్ లు రన్ చేస్తున్నారు. మ‌నోజ్ కూడా ఉన్న స‌మ‌యంలో ఫుల్ బిజీ అవ్వాల‌నే ఇలా ఇన్ని ర‌కాల ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకెళ్తున్న‌ట్లు తెలుస్తోంది.