Begin typing your search above and press return to search.

మంచు లక్ష్మీ.. స్టైలిష్ లుక్కులో ఘాటైన అందం

తాజాగా స్టెలిష్ ఫొటోలను పోస్ట్ చేసింది మంచు లక్ష్మి. వెడ్డింగ్‌ సీజన్‌ లో పర్ఫెక్ట్‌ మెహెందీ లుక్‌ అంటూ ఇటీవల ఎల్లో కలర్ డ్రెస్ లో దిగిన ఫొటోలను షేర్ చేసిన ఈ అమ్మడు..

By:  Tupaki Desk   |   24 Feb 2024 11:00 AM GMT
మంచు లక్ష్మీ.. స్టైలిష్ లుక్కులో ఘాటైన అందం
X

మంచు మోహన్ బాబు డాటర్ మంచు లక్ష్మి ఇటీవల హైదరాబాద్ నుంచి ముంబయికి షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే. నిర్మాతగా, ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో దూసుకెళ్తున్న ఈ అమ్మడు.. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో సందడి చేస్తోంది. రకరకాల డ్రెస్సులో పోజులు ఇస్తూ మైమరిపిస్తోంది. ముంబయి వెళ్లినప్పటి నుంచి ఫుల్ స్కిన్ షో చేస్తోంది. ఉత్తరాదికి వెళ్లి ఒక్కసారిగా గ్లామర్ డోస్ పెంచేసింది.

తగ్గేదే లే అంటూ ప్రజెంట్ హీరోయిన్లకు పోటీగా గ్లామరస్ పోజులు ఇస్తోంది. అందాల ఆరబోతలో దూసుకుపోతోంది. నాలుగు పదుల వయసులో కూడా నెట్టింట సెగలు పుట్టిస్తోంది. ఎప్పటికప్పుడు ఫ్యామిలీ అప్డేట్స్ తోపాటు సమాజంలో జరుగుతున్న వివిధ విషయాలపై స్పందిస్తుంటోంది. పార్టీలు, ఫారిన్ లో చిల్ అయిన ఫొటోలను పోస్ట్ చేస్తుంటుంది. కెరీర్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఫ్యాన్స్ తో ఫుల్ గా టచ్ లో ఉంటోంది.

తాజాగా స్టెలిష్ ఫొటోలను పోస్ట్ చేసింది మంచు లక్ష్మి. వెడ్డింగ్‌ సీజన్‌ లో పర్ఫెక్ట్‌ మెహెందీ లుక్‌ అంటూ ఇటీవల ఎల్లో కలర్ డ్రెస్ లో దిగిన ఫొటోలను షేర్ చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు సంగీత్ పిక్స్ అంటూ పంచుకుంది. గ్రే కలర్ ట్రెండీ ఔట్ ఫిట్ లో అందాలు ఆరబోసింది. ఫ్లోరల్ కోట్ వేసుకుని కొంటె చూపులతో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పిక్స్ వేరే లెవెల్ లో ఉన్నాయని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

కలెక్షన్ కింగ్ మోహన్‌ బాబు వారసురాలిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది మంచు లక్ష్మి. హీరోయిన్గా, విలన్ గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, టీవీ యాంకర్ గా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఓ వైపు మూవీలు చేస్తూనే, ఇంకోవైపు ఛాన్సులు వస్తే వెబ్ సిరీసులు కూడా చేస్తూ అలరిస్తోంది.

ఇటీవల కొత్త కెరీర్ ను మొదలుపెట్టడానికి బీటౌన్ ముంబయికి వెళ్లిపోయింది. హిందీలో ఆడిషన్స్ ఇవ్వడానికి కూడా రెడీ అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అంతే కాకుండా యూట్యూబ్ ఛానల్ ద్వారా తన లైఫ్ స్టైల్ తోపాటు మరిన్ని అంశాల గురించి వీడియోలను షేర్ చేస్తోంది. మరి మంచు డాటర్.. బాలీవుడ్ లో ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.