Begin typing your search above and press return to search.

మైండ్ బ్లాక్ చేసిన మంచు ల‌క్ష్మి

మంచు లక్ష్మి తెలుగు చిత్రసీమలో ప్రముఖ నటి, నిర్మాత‌, బుల్లితెర హోస్ట్. ఆల్ రౌండ‌ర్ నైపుణ్యంతో మంచు ఫ్యామిలీకే వ‌న్నె తెచ్చిన మ‌హిళ‌

By:  Tupaki Desk   |   11 March 2024 5:47 PM GMT
మైండ్ బ్లాక్ చేసిన మంచు ల‌క్ష్మి
X

మంచు లక్ష్మి తెలుగు చిత్రసీమలో ప్రముఖ నటి, నిర్మాత‌, బుల్లితెర హోస్ట్. ఆల్ రౌండ‌ర్ నైపుణ్యంతో మంచు ఫ్యామిలీకే వ‌న్నె తెచ్చిన మ‌హిళ‌. ఇటీవ‌ల మంచు ల‌క్ష్మి సోష‌ల్ మీడియాల్లోను స్పీడ్ గా ఉన్నారు. రెగ్యుల‌ర్ గా ఇంటర్నెట్ లో అబ్బురపరిచే ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తుంటే, వాటిని అభిమానులు జోరుగా వైర‌ల్ చేస్తున్నారు. ఇటీవ‌లే తెల్ల చీర‌లో ఎంతో అందంగా క‌నిపించిన ఫోటోల‌ను షేర్ చేసిన ల‌క్ష్మి మంచు ఇంత‌లోనే ఈరోజు పూర్తి కాంట్రాస్టుగా కొత్త లుక్ తో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఈ లుక్ కి ఇన్ స్టా హీటెక్కుతోంది.

లక్ష్మీ లుక్ సంథింగ్ స్పెష‌ల్ గా ఆక‌ర్షిస్తోంది. బ్రౌన్ లిప్ షేడ్, పింక్-టింటెడ్ చిక్స్, కాజ‌ల్ మాస్కరా లాడెన్ కనురెప్పలతో అంద‌మైన‌ మేకప్ లుక్ లో మంచు ల‌క్ష్మి క‌నిపించింది. ల‌క్ష్మి మంచు శ‌రీరంపై అక్క‌డ‌క్క‌డా టాటూలు ఎంతో అందంగా ఒద్దిక‌గా ఒదిగిపోయి క‌నిపిస్తున్నాయి. ముఖ్యంగా ల‌క్ష్మీ మంచు బోల్డ్ లుక్ ని చూడ‌గానే ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అయిందంటూ కామెంట్ చేస్తున్నారు. ల‌క్ష్మీ మంచు ఇన్న‌ర్ ని ధ‌రించి స్వేచ్ఛ‌గా అందాల‌ను ఎలివేట్ చేసిన తీరుకు మంత్ర ముగ్ధులు అయిపోతున్నారు. ఆ మెడ‌లో ధ‌రించిన హెవీ వ‌ర్క్ డిజైన‌ర్ హారం త‌న‌లో హాట్ కంటెంట్ ని ప‌దింత‌లు పెంచింది. యాన్ ఓడే టు ది ఆస్కార్స్ అనే ట్యాగ్ తో ఈ ఫోటోషూట్ ని షేర్ చేసింది.

మంచు ల‌క్ష్మి మునుపెన్న‌డూ చూడ‌నంత హాట్ గా క‌నిపిస్తోంది అంటూ అభిమానులు దీనికి కాంప్లిమెంట్లు ఇస్తున్నారు. నిజానికి హాలీవుడ్ లో న‌టిగా కెరీర్ ప్రారంభించి, టాలీవుడ్ కి వ‌చ్చిన ల‌క్ష్మీ మంచు కెరీర్ లో కొన్ని ఫైనెస్ట్ క్యారెక్ట‌ర్ల‌తో హృద‌యాల‌ను గెలుచుకున్నారు. ఇటీవ‌ల హాలీవుడ్ కి మ‌ళ్లీ వెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపించాయి. రాజ్ అండ్ డీకే లాంటి ప్ర‌తిభావంతులు ల‌క్ష్మీ మంచులోని ట్యాలెంటును భ‌విష్య‌త్ లో స‌ద్వినియోగం చేసేందుకు ఆస్కారం ఉంద‌ని, వెబ్ సిరీస్ ల‌లో న‌టించేందుకు ఛాన్సుంద‌ని కూడా నెటిజ‌నుల్లో చ‌ర్చ సాగింది. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. పిట్ట‌క‌థ‌లు, మాన్ స్ట‌ర్ లాంటి సినిమాల త‌ర్వాత ల‌క్ష్మి మంచు పెద్ద తెర‌పై క‌నిపించ‌లేదు. త‌దుప‌రి త‌న ప్ర‌ణాళిక‌లు ఏమిట‌న్న‌ది కూడా వెల్ల‌డి కావాల్సి ఉంది.