Begin typing your search above and press return to search.

మంచు లక్ష్మి స్టన్నింగ్.. బ్లూలో బ్లాస్ట్ చేసేలా..

టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీకి డిఫరెంట్ క్రేజ్ ఉంది. సెలబ్రెటీ కుటుంబాల నుంచి ఎక్కువగా హీరోలు మాత్రమే వస్తూ ఉంటారు

By:  Tupaki Desk   |   16 April 2024 4:09 AM GMT
మంచు లక్ష్మి స్టన్నింగ్.. బ్లూలో బ్లాస్ట్ చేసేలా..
X

టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీకి డిఫరెంట్ క్రేజ్ ఉంది. సెలబ్రెటీ కుటుంబాల నుంచి ఎక్కువగా హీరోలు మాత్రమే వస్తూ ఉంటారు. అయితే మంచు లక్ష్మి తన తండ్రి మోహన్ బాబు సినీ వారసత్వం అందుకొని ఆయన దారిలోనే నటిగా అడుగుపెట్టింది. అనగనగా ఒక ధీరుడు సినిమాతో మంచు లక్ష్మి టాలీవుడ్ అరంగేట్రం చేసింది. మొదటి సినిమాలోనే విలన్ గా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో మంచు లక్ష్మి మెప్పించి.

దానికంటే ముందుగా మంచి లక్ష్మి లో అమెరికన్ వెబ్ సిరీస్ లలో కీలక పాత్రలలో కనిపించింది. అయితే మాతృభాషలో నటిగా ప్రూవ్ చేసుకోవాలని ఇండియా వచ్చేసింది. తరువాత అవకాశాలు అందిపుచ్చుకుంది. గుండెల్లో గోదావరి సినిమాలో తాప్సితో పాటు ఒక హీరోయిన్ గా మంచు లక్ష్మి నటించింది. సోలోగా ఫీమేల్ సెంట్రిక్ కథలతో మంచు లక్ష్మి ప్రేక్షకుల ముందుకి వచ్చి మెప్పించింది. నిర్మాతగా కూడా మారి సినిమాలు తెరకెక్కించింది. అలాగే బుల్లితెరపై హోస్ట్ గా కీడా సక్సెస్ అయ్యింది.

తాజాగా బ్లూ కలర్ లాంగ్ ఫ్రాక్ లో ఉన్న గ్లామరస్ ఫోటోలను ఈ అమ్మడు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ ఫోటోలు కాస్తా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ స్టైలిష్ కలర్ డ్రెస్ లో మంచు లక్ష్మి మరింత అందంగా మెరిసిపోతోంది. హీరోయిన్స్ కి ఏ మాత్రం తగ్గని అందంతో కనువిందు చేస్తోంది. రానున్న రోజుల్లో మంచు లక్ష్మిని కచ్చితంగా గ్లామర్ క్యారెక్టర్స్ లో చూసే అవకాశం ఉండొచ్చని ప్రస్తుతం ఆమె చేస్తోన్న ఫోటో షూట్ ల బట్టి అర్ధమవుతోంది.

నటిగా ఇప్పటికే ప్రూవ్ చేసుకున్న మంచు లక్ష్మి సినిమాలు కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. అయిన కూడా తన ప్రయత్నంలో ముందుకి వెళ్తూనే ఉన్నారు. ప్రస్తుతం మంచు లక్ష్మి చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఆదిపర్వం, అగ్నినక్షత్రం అనే సినిమాలు ఈ అమ్మడు నుంచి రాబోతున్నాయి. ఆదిపర్వం మూవీ టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. థ్రిల్లర్ కథాంశంతో యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో ఈ ఆదిపర్వం మూవీ ఉండబోతోందని అర్ధమవుతోంది.

అగ్నినక్షత్రం మూవీ కంప్లీట్ యాక్షన్ స్టోరీతో తెరకెక్కుతోందంట. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో మంచు లక్ష్మి గ్లామర్ షో పరంగా స్పీడ్ పెంచింది. 42 ఏళ్ళ వయస్సులో ఉన్న ఈ బ్యూటీ హిందీలో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో నార్త్ ఇండియన్ దర్శకులు, ప్రొడ్యూసర్స్ ని ఎట్రాక్ట్ చేయడం కోసం ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా మోడ్రన్ గా డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తో కనువిందు చేస్తోంది. మరి ఆమెకు అటువైపు నుంచి ఏమైనా అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.