Begin typing your search above and press return to search.

మంచు లక్ష్మి పింక్ సూట్ చూశారా?

అయితే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు కాకుండా ఫీమేల్ సెంట్రిక్ కథలు చేయడానికి ఈ అమ్మడు ఎక్కువగా మొగ్గు చూపించింది

By:  Tupaki Desk   |   29 Feb 2024 4:23 AM GMT
మంచు లక్ష్మి పింక్ సూట్ చూశారా?
X

మంచు ఫ్యామిలీ నుంచి మోహన్ బాబు వారసురాలిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టి నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ మంచు లక్ష్మి. పెళ్లి తర్వాత ఆమె నటిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టడం విశేషం. మొదటి సినిమా అనగనగా ఒక ధీరుడు మూవీతోనే తనలో ఏ స్థాయిలో పెర్ఫార్మర్ ఉందో మంచు లక్ష్మి ప్రూవ్ చేసుకుంది.

అయితే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు కాకుండా ఫీమేల్ సెంట్రిక్ కథలు చేయడానికి ఈ అమ్మడు ఎక్కువగా మొగ్గు చూపించింది. నటిగా తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ఆశించిన స్థాయిలో సక్సెస్ లు మాత్రం అందుకోలేకపోయింది. తరువాత హోస్ట్ గా మంచు లక్ష్మి బుల్లితెరపై మంచి సక్సెస్ అందుకుంది.

వెండితెరపై మాత్రం ఇప్పటికి బ్లాక్ బస్టర్ హిట్ కోసం వెయిట్ చేస్తూనే ఉంది. ప్రస్తుతం థ్రిల్లర్ జోనర్ లో ఈ అమ్మడు ఆదిపర్వం అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అలాగే యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో అగ్ని నక్షత్రం అనే మరో మూవీ కూడా చేస్తోంది. ఈ రెండు సినిమాలు ఆమెకి సక్సెస్ ఇస్తాయనే నమ్మకంతో ఉంది.

చివరిగా మలయాళంలో మోనిస్టర్ అనే సినిమాలో విలనీగా మంచు లక్ష్మి కనిపించింది. అదిరిపోయే పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా మంచు లక్ష్మి ఇన్ స్టాగ్రామ్ లో గ్లామర్ షో పెంచింది. రెగ్యులర్ గా డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తో గ్లామరస్ ఫోటోలని షేర్ చేస్తోంది. ఈ ఫోటోలు కాస్తా వైరల్ అవుతున్నాయి.

తాజాగా పింక్ కలర్ సూట్ లో అదిరిపోయే స్టిల్స్ తో హీటెక్కించే ఫోజులు ఇస్తూ ఫోటోలని మంచు లక్ష్మి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలపై నెటిజన్లు ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. మంచు లక్ష్మి గ్లామర్ రోజు రోజుకి పెరిగిపోతుందనే కామెంట్స్ ఈ పిక్స్ చూసిన తర్వాత నెటిజన్లు నుంచి వస్తోన్న స్పందన. మరి ఈ స్థాయిలో అల్ట్రా మోడ్రన్ విమెన్ గా మంచు లక్ష్మి సందడి చేయడానికి కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది.