Begin typing your search above and press return to search.

మంచు లక్ష్మి పొట్టి డ్రెస్ వెనకాల..?

మంచు లక్ష్మి మొదట టాక్ షో ద్వారానే ఇండస్ట్రీలో గుర్తింపును అందుకుంది.

By:  Tupaki Desk   |   3 April 2024 10:18 AM GMT
మంచు లక్ష్మి పొట్టి డ్రెస్ వెనకాల..?
X

సినిమా ఇండస్ట్రీలో వారసులుగా ఎంట్రీ ఇచ్చిన వారు చాలామంది ఉన్నారు. అయితే అందులో వివిధ రకాల షేడ్స్ లో గుర్తింపు అందుకున్న వారు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. ఇక మంచు లక్ష్మి కూడా ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో విభిన్నంగా క్రేజ్ అందుకునే ప్రయత్నం చేశారు. నిర్మాతగానే కాకుండా నటిగా యాంకర్ గా మంచి గ్లామరస్ బ్యూటీగా కూడా ఆమె తనను తాను సరికొత్తగా హైలెట్ చేసుకున్నారు.


మంచు లక్ష్మి మొదట టాక్ షో ద్వారానే ఇండస్ట్రీలో గుర్తింపును అందుకుంది. ఇక తర్వాత అనగనగా ఒకదీరుడు సినిమాలో విలన్ గా చేసి ఎవరు ఊహించని పాత్రలో కనిపించింది. ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసిన ఆమె పలు చిత్రాలను కూడా నిర్మించింది. ఇక సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా కొనసాగుతున్న మంచి లక్ష్మి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా తన గ్లామర్ తో అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.


నేటితరం యువ హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గకుండా ఆమె తన అందంతో పోటీని ఇస్తుంది అని చెప్పవచ్చు. డిఫరెంట్ స్టైలిష్ గ్లామరస్ డ్రెస్సులో ఆమె కనిపించే విధానం ఫాలోవర్స్ కు స్టన్ అయ్యేలా చేస్తోంది. ఇక రీసెంట్ గా కూడా ఆమె ఒక పొట్ట డ్రెస్ లో దర్శనమిచ్చిన విధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో కూడా హై గ్లామరస్ డ్రెస్ లలో కనిపించింది.


అయితే ఈ లుక్స్ మాత్రం మరింత స్టైలిష్ గా ఉన్నాయి అంటూ ఆమె పొట్టి డ్రెస్ కూడా వావ్ అనిపించేలా ఉంది అంటూ మరికొందరు పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. అయితే మంచు లక్ష్మి ఇంత ఘాటైన పొట్టి డ్రెస్సులలో కనిపించడానికి గల కారణం ఏమిటి అనే ప్రశ్నలు కూడా గట్టిగానే వస్తున్నాయి. సాధారణంగా ఆమె థింకింగ్ హై లెవెల్ లోనే ఉంటుంది అని చెప్పవచ్చు. రీసెంట్ గా మంచు లక్ష్మి టాలీవుడ్ నుంచి ముంబైకు షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఆమె మొదట్లోనే హాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.


అయితే ఇప్పుడు ముంబైకి షిఫ్ట్ అయిన నేపథ్యంలో మంచి లక్ష్మి అక్కడ గ్లామరస్ బ్యూటీలకు మరింత పోటీ ఇచ్చే విధంగా ఇప్పుడు తను తాను సరికొత్తగా ఇలా ప్రెజెంగ్ చేసుకుంటోంది. 42 ఏళ్ల వయసులో మంచు లక్ష్మి ఇంత అందంతో కనిపిస్తోంది అంటే మామూలు విషయం కాదు. ఆమె ఫిట్నెస్ లో కూడా ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు తన గ్లామర్ తో కూడా నేటి తరం యువ హీరోయిన్స్ కు ఏమాత్రం తక్కువ కాదు అని నిరూపిస్తోంది. మరి బాలీవుడ్ లో మంచు లక్ష్మి ఎలాంటి అడుగులు వేస్తుందో కాలమే సమాధానం ఇవ్వాలి.