Begin typing your search above and press return to search.

మంచు లక్ష్మి.. హీటెక్కించే క్లివెజ్ షో

డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు వారసులు ఎవరికి వారు స్పెషల్ క్రేజ్ తో ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు

By:  Tupaki Desk   |   14 Feb 2024 7:34 AM GMT
మంచు లక్ష్మి.. హీటెక్కించే క్లివెజ్ షో
X

డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు వారసులు ఎవరికి వారు స్పెషల్ క్రేజ్ తో ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వారి కూతురు మంచు లక్ష్మి. మొదట యాంకరింగ్, పలు టీవీ షోలతో తన కెరీర్ స్టార్ చేసి ఆ తర్వాత వెండి తెరపైకి కూడా అడుగుపెట్టారు. మంచి కథలో కీలకమైన క్యారెక్టర్లను ఎంచుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. సక్సెస్ ఫెయిల్యూర్స్ సంబంధం లేకుండా ఆమె కెరీర్ కొనసాగుతోంది.


ఇక మంచు లక్ష్మి సోషల్ మీడియాలోనూ చాలా చురుకుగా కనిపిస్తూ ఉంటుంది. రెగ్యులర్ గా తనకు సంబంధించిన , తన కూతురుకు సంబంధించిన వీడియోలను పోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే యూట్యూబ్ లోనూ కొన్ని వీడియోలు పోస్ట్ చేసే ఆమె లైఫ్ స్టైల్ కు సంబంధించిన చిట్కాలు కూడా చెబుతూ ఉంటారు. ఇక గ్లామర్ తోను నేటితరం భామలకు పోటీగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక ట్రెండీగా, మోడ్రన్ లుక్స్ ని ఇష్టపడుతూ ఉండే మంచు లక్ష్మి. ఈ మధ్యకాలంలో గ్లామర్ విషయంలోను నెవ్వర్ బిఫోర్ అనేలా హైలెట్ అవుతున్నారు. రీసెంట్ గా అమ్మడు బ్లాక్ అండ్ వైట్ ఫోటో షూట్ లో అందంగా కనిపించారు. నిజానికి ఆ డ్రెస్ లో ఆమె చాలా స్టన్నింగ్ గా కనిపిస్తున్నారనే కామెంట్స్ వస్తున్నాయి.

నిజానికి ఆమె వయసు ఐదు పదులకు దగ్గరపడుతున్నా, ఆమె చాలా ఫిట్ గా కనిపిస్తూ ఉంటారు. ఆమె వ్యాయామాలు , యోగా లాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. అందుకే, ఈ వియసులోనూ చాలా యవ్వనంగా ఫిట్ గా కనిపిస్తున్నారు. ఇక ఈ తరహా ఫోటోలతో పాటు, ఆమె మాట్లాడే మాటలను సైతం చాలా మంది ట్రోల్ చేస్తూ ఉంటారు. కానీ ఎన్ని ట్రోల్స్ చేసినా, ఆమె మాత్రం పట్టించుకోకుండా, తనకు నచ్చిన విధంగా ముందుకు దూసుకుపోతూ ఉంటారు.

ఇక మంచు లక్ష్మి నటిగా తెలుగుతోపాటు తమిళంలోనూ మెరిసింది. ఇటీవల మలయాళంలో ఓ సినిమా చేయడం విశేషం.రీసెంట్ గా మానిస్టర్ మూవీలో లెస్బియన్ గా నటించి షాకిచ్చింది. అందులో అమ్మడు లిప్ లాక్ సీన్స్ లోను స్టన్ అయ్యేలా కనిపించింది. ఇక తెలుగులో మంచు లక్ష్మి నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం ఓ కథపై చర్చలు జరుపుతున్నట్లు టాక్.