Begin typing your search above and press return to search.

మంచు లక్ష్మి బర్త్ డే బ్లాస్ట్… ఊహించని లుక్

మంచు మోహన్ బాబు కూతురుగా టాలీవుడ్ లో అందరికి సుపరిచితం అయిన బ్యూటీ మంచు లక్ష్మి. ఈమె నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని క్రియేట్ చేసుకుంది

By:  Tupaki Desk   |   11 Oct 2023 4:52 AM GMT
మంచు లక్ష్మి బర్త్ డే బ్లాస్ట్… ఊహించని లుక్
X

మంచు మోహన్ బాబు కూతురుగా టాలీవుడ్ లో అందరికి సుపరిచితం అయిన బ్యూటీ మంచు లక్ష్మి. ఈమె నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని క్రియేట్ చేసుకుంది. హీరోయిన్ గా కాకపోయిన ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ తో తనదైన ముద్రని సృష్టించుకుంది. ఇప్పటికే టాలీవుడ్ లో కొంతమంది ఫిమేల్ సెంట్రిక్ స్టోరీస్ తో మంచు లక్ష్మిని లీడ్ గా మూవీస్ చేస్తూ ఉంటారు.

ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. రీసెంట్ గా ఒక మూవీ ఫస్ట్ లుక్ వచ్చింది. థ్రిల్లర్ జోనర్ కథలతో మంచు లక్ష్మి ఎక్కువగా మూవీస్ చేస్తోంది. సినిమాలకంటే బయట మంచు లక్ష్మి లైఫ్ స్టైల్ ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది. ఆమె మాట్లాడే విధానం అమెరికన్ స్లాంగ్ తో ఉంటుంది. ఈ కారణంగానే మంచు లక్ష్మి మీద అందరూ మీమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు.

అలాగే హీరోయిన్స్ తో మంచి రిలేషన్ షిప్ మెయింటేన్ చేస్తూ ఉంటుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ అయిన వాళ్ళు అందరూ ఇంచుమించుగా మంచులక్ష్మితో మంచి బాండింగ్ కొనసాగిస్తారు. ఈ మధ్య సోషల్ మీడియాలో మంచు లక్ష్మి యాక్టివ్ అయ్యారు. డ్రెస్సింగ్ స్టైల్ తో కాస్తా షాక్ ఇస్తున్నారు. హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోకుండా బోల్డ్ ఫోటోషూట్ లకి ఫోజులు ఇస్తున్నారు.

తాజాగా మంచు లక్ష్మి బర్త్ డే పార్టీకి సంబందించిన వీడియో ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. పింక్ కలర్ షార్ట్, టాప్ ధరించి చిన్నపిల్లలా మారిపోయి పార్టీలో మంచు లక్ష్మి ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ బర్త్ డే పార్టీకి ఇండస్ట్రీలో ఆమెతో క్లోజ్ గా ఉన్న హీరోయిన్స్ అందరూ అటెండ్ అయ్యారు.బర్త్ డే ఈవెంట్ లో ఫుల్ ఫన్ తో ఆమె అందరిని పలకరిస్తూ సెలబ్రేట్ చేసుకున్న విధానాన్ని వీడియోగా ఇన్ స్టాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అవుతోంది.

అయితే ఈ వీడియోలో మంచు లక్ష్మి వేసుకున్న డ్రెస్ పై కొంతమంది నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది అయితే వేరే విధమైన కామెంట్స్ పెట్టి ట్రోల్ చేస్తున్నారు. మెజారిటీ ఫాలోవర్స్ మాత్రం మంచు లక్ష్మి డ్రెస్ లో చాలా అందంగా ఉన్నారంటూ కితాబు ఇస్తున్నారు. ఈ పార్టీలో రకుల్ ప్రీత్ సింగ్, తాప్సి లాంటి స్టార్ యాక్టర్స్ కూడా సందడి చేశారు.