Begin typing your search above and press return to search.

మంచు కన్నప్ప వెయిట్‌ పెరుగుతూనే ఉన్నాడు..!

తాజాగా మంచు కాంపౌండ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా లో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్ దేవగన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

By:  Tupaki Desk   |   30 Oct 2023 9:28 AM GMT
మంచు కన్నప్ప వెయిట్‌ పెరుగుతూనే ఉన్నాడు..!
X

మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా చేస్తున్న భక్త కన్నప్ప సినిమా లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అంటూ ఇప్పటికే వార్తలు వచ్చాయి. పాత్ర చిన్నదో లేదా పెద్దదో కానీ భక్త కన్నప్ప సినిమా లో ప్రభాస్ కనిపించబోతున్న నేపథ్యం లో సినిమా పై అంచనాలు అమాంతం పెరిగాయి. సినిమా స్థాయి అమాంతం పెరిగింది అనడంలో సందేహం లేదు.

ప్రభాస్ మాత్రమే కాకుండా మంచు వారి భక్త కన్నప్ప సినిమా లో మలయాళ సూపర్ స్టార్‌ మోహన్‌ లాల్‌ కూడా కనిపించబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా మంచు విష్ణు టీమ్ వెల్లడించడం జరిగింది. ఆదివాసీ జాతీకి చెందిన ఒక కీలక పాత్ర లో మోహన్ లాల్‌ ను చూడబోతున్నామని సమాచారం అందుతోంది.

మోహన్‌ లాల్‌, ప్రభాస్‌ మాత్రమే కాకుండా ఇంకా పలువురు ప్రముఖ నటి నటులు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. తాజాగా మంచు కాంపౌండ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా లో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్ దేవగన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ సభ్యులు ఆఫ్‌ ది రికార్డ్‌ స్పష్టం చేశారు. బాలీవుడ్ స్టార్ నటుడు ఎంట్రీ తో భక్త కన్నప్ప వెయిట్ మరింత పెరిగినట్లు అయింది.

ఈ సినిమాలో కనిపించబోతున్న శివుడు, పార్వతి దేవి పాత్రల విషయంలో మంచు విష్ణు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు అని వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్ లో జరుగుతున్న ప్రచారం ప్రకారం శివుడు పాత్ర లో ప్రభాస్‌, పార్వతి పాత్రలో నయనతార కనిపించబోతున్నారు. వీరిద్దరు కూడా 5 నుంచి 10 నిమిషాల స్క్రీన్‌ ప్రజెన్స్ తో సినిమాలో కనిపించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక అజయ్ దేవగన్ పాత్ర ఏంటి అనే ఆసక్తికర చర్చ జరుగుతోంది.