Begin typing your search above and press return to search.

కన్నప్ప కోసం మంచు హీరో కొత్త టాలెంట్

విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ బిల్డ్ చేసుకున్న నటుడు మంచు విష్ణు.

By:  Tupaki Desk   |   25 Nov 2023 4:12 AM GMT
కన్నప్ప కోసం మంచు హీరో కొత్త టాలెంట్
X

విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ బిల్డ్ చేసుకున్న నటుడు మంచు విష్ణు. కెరియర్ లో చెప్పుకోదగ్గ సక్సెస్ ఫుల్ సినిమాలు లేకపోయిన కూడా ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు కొత్త కథలను అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఓ విధంగా మంచు విష్ణుకి కలిసి రావడం లేదని చెప్పాలి. చివరిగా జిన్నా సినిమాతో మంచు విష్ణు ప్రేక్షకుల ముందుకి వచ్చారు.

ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. మంచు విష్ణు చేసే సినిమాలకు చాలావరకు అతనే నిర్మాతగా ఉంటారు. 24 ఫ్రేమ్స్ బ్యానర్ లో మూవీస్ వస్తూ ఉంటాయి. ప్రస్తుతం మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పను పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్నారు. ఈ సినిమాలో మెయిన్ లీడ్ రోల్ లో నటించడంతో పాటు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

హిందీలో పౌరాణిక కథలతో ఎన్నో సీరియల్స్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ మూవీతో టాలీవుడ్ లో దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ కి చాలా ఇంప్రెషన్స్ వచ్చాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మంచు విష్ణు పెన్ను పట్టి రైటర్ గా కూడా మారారు.

తనికెళ్ల భరణి రాసిన కన్నప్ప కథకి మాటలు, స్క్రీన్ ప్లే మంచు విష్ణు సమకూర్చినట్లు పోస్టర్ లో ఉంది. ఈ ట్రెండ్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఆయన కన్నప్ప కథకి డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించినట్లుగా టాక్ వినిపిస్తోంది. గతంలో మంచు విష్ణు సంపూర్ణేష్ బాబు హీరోగా నిర్మించిన సింగం 123 సినిమాకి కథ అందించారు.

అయితే అది కంప్లీట్ సెటైరికల్ మూవీ కావడంతో మంచు విష్ణు టాలెంట్ ని పెద్దగా ఎవరు గుర్తించలేదు. ఇప్పుడు కన్నప్ప సినిమా సక్సెస్ అయితే మాత్రం రైటర్ గా కూడా మంచు విష్ణు కి మంచి ఎస్టాబ్లిష్మెంట్ దొరికే అవకాశం ఉందని టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తున్న మాట. మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుందనేది వేచి చూడాలి.