'కన్నప్ప' తర్వాత విష్ణు కెరీర్ ఎలా ఉండబోతుంది?
తప్పక విజయం సాధిస్తుందని పాన్ ఇండియాలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడుతుందని ఎంతో కాన్పిడెంట్ గా ఉన్నారు.
By: Tupaki Desk | 28 May 2025 5:15 PM ISTమంచు వారి వారసుడు విష్ణు కెరీర్ ప్రారంభమై రెండు దశాబ్ధాలు దాటింది. 'విష్ణు'తో కెరీర్ ప్రారంభించి 'జిన్నా' వరకూ చాలా సినిమాలు చేసాడు. వాటిలో 'ఢీ 'మాత్రం మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. ఇంకా చాలా సినిమాలు చేసాడు. కానీ అవేవి విష్ణుకు ఆశించిన స్థాయిలో పేరు తీసుకురాలేదు. అలా రెండు దశాబ్దాల కెరీర్ సాగిపోయింది. 'జిన్నా' తర్వాత కొడితే కుంభ స్థలాన్నే కొట్టాలి అన్నట్లు ఏకంగా పాన్ ఇండియా మార్కెట్ నే టార్గెట్ చేసి 'కన్నప్ప' చిత్రాన్ని చేసాడు.
ఈ సినిమా కోసం తానే రైటర్ గానూ మారాడు. తండ్రిమోహన్ బాబు ప్రతి ష్టాత్మ కంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో సినిమాకు బజ్ క్రియేట్ అవుతుంది. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ లాంటి స్టార్లతో భారీ కాన్సాస్ పై తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ సినిమాపై విష్ణు సహా మంచు ఫ్యామిలీ చాలా ఆశలు పెట్టుకుంది.
తప్పక విజయం సాధిస్తుందని పాన్ ఇండియాలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడుతుందని ఎంతో కాన్పిడెంట్ గా ఉన్నారు. అందుకు తగ్గట్టే చిత్రం కోసం విష్ణు ఎంతో కష్టపడ్డాడు. చిత్రీకరణ అంతా న్యూజి లాండ్ లోనే నిర్వహించారు. తాను రాసుకున్న కథకు అక్కడ లొకేషన్లు డిమాండ్ చేయడంతో విష్ణు ఎంత మాత్రం రాజీ పడకుండా నెలల తరబడి షూటింగ్ చేసారు. ఫైనల్ గా సినిమా రిలీజ్ కు సమయం ఆసన్నమైంది.
అతి త్వరలోనే సస్పెన్స్ కు తెర పడనుంది. అయితే ఈ సినిమా తర్వాత విష్ణు కెరీర్ ఎలా ఉంటుంది? అన్నది ఆసక్తికరంగా మారింది. పాన్ ఇండియాలో గుర్తింపు రావాలనే సంకల్పంతోనే విష్ణు 'కన్నప్ప' చేసాడు అన్నది అందరికి తెలిసిందే. మరి సినిమా ఇండియాని షేక్ చేసే హిట్ అందుకుంటుందా? లేదా? అన్నది చూడాలి. హిట్ అయితే విష్ణు కెరీర్ కొత్త టర్నింగ్ తీసుకుంటుంది. పాన్ ఇండియా హీరోల సరసన నిలబడతాడు. బాలీవుడ్ లోనూ అవకాశాలొస్తాయి. కన్నప్ప ను ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది.
